NRI-NRT

[Video]-ఫిలడెల్ఫియాలో పిడిగుద్దులు గుద్దుకున్న ఇరు తెలుగు వర్గాలు

[Video]-ఫిలడెల్ఫియాలో పిడిగుద్దులు గుద్దుకున్న ఇరు తెలుగు వర్గాలు

ఫిలడెల్ఫియాలో శనివారం రాత్రి డౌన్‌టౌన్‌లోని మారియట్ హోటల్ వద్ద కనెక్టికట్‌కు చెందిన ఓ తెలుగు వర్గం, వర్జీనియాకు చెందిన మరో తెలుగు వర్గం మధ్య పిడిగుద్దుల యుద్ధం జరిగింది. నినాదాలు ఎందుకు చేస్తున్నారనే చిన్న ప్రశ్నతో మొదలైన ఈ వాగ్వాదం బాక్సింగ్ వీరులను మరిపించింది. బే ఏరియాకు చెందిన ఓ ప్రముఖ ప్రవాసాంధ్రుడు ఆపడానికి ప్రయత్నించినప్పటికీ మందు మత్తులో జోగుతున్న వీరంతా తమ బాహుబలాన్ని విచ్చలవిడిగా నిస్సిగ్గుగా ప్రదర్శించారు. మారియట్ ద్వారం వద్ద ఈ తతంగం పూర్తి అయ్యాక లాబీలో స్టాండులు, కుర్చీలను ఒకరిమీదకు ఒకరు విసురుకుని తమ పరువును, తెలుగువారి పరువును బజారుకీడ్చారు. భద్రతా సిబ్బంది నియంత్రించేందుకు ప్రయత్నించినప్పటికీ అధిక సంఖ్యలో ఈ తెలుగు గ్రూపు సభ్యులు ఉండటం వలన వీలుపడలేదు. రాత్రి 11గంటలకు మొదలైన ఈ రచ్చ తెల్లవారుఝామున 4గంటల వరకు సాగుతూనే ఉంది.

View post on imgur.com