Agriculture

అర్హులైన రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోండి

అర్హులైన రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోండి

తెలంగాణ రైతులకు అలర్ట్..కొత్తగా అర్హులైన రైతులకు రైతు బీమా వర్తింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నేటి నుంచి ఆగస్టు 5లోపు వారి వివరాలు నమోదు చేయనున్నారు. జూన్ 18 వరకు పట్టాదారు పాస్బుక్ పొందినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకుఖాతా, నామిని ఆధార్ జిరాక్స్ పేపర్ ను స్థానిక ఏవోలకు అందజేయాలి.కాగా, జులై 12న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, జూనియర్ కాలేజీల బంద్ నిర్వహిస్తున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ఈ బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ASIF నేతలు… రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తోందని ఆరోపించారు. బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా సీఎం కేసీఆర్ విద్యార్థులపై చిన్న చూపు చూస్తున్నారని… నిత్యవసరాలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు.