ఇండియన్ సినిమా రేంజ్ రోజురోజుకు పెరిగిపోతుంది. సౌత్ సినిమాల వైపు ప్రపంచమే తొంగిచూస్తోంది. పాన్ ఇండియా రేంజ్ కాస్తా.. పాన్ ఇండియా వరల్డ్ గా మారిపోతుంది. అందుకు కారణం దర్శకధీరుడు రాజమౌళి అని చెప్పఁడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. బాహుబలి తో దేశాన్ని.. ఆర్ఆర్ఆర్ తో ప్రపంచాన్ని జయించాడు. జపాన్ లో ఆర్ఆర్ఆర్ ఇప్పటికి రచ్చ చేస్తున్న విషయం తెల్సిందే. ఆస్కార్ అవార్డు అందుకున్న ఈ సినిమా .. జపాన్ లో సైతం రిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయి కలక్షన్స్ ను సాధించింది. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ బాటలోనే కెజిఎఫ్ నడుస్తోంది. కన్నడ స్టార్ హీరో యష్, శ్రీనిధి శెట్టి జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ సినిమా చరిత్రను తిరగరాసిన సినిమాగా కెజిఎఫ్ ను చెప్పుకోవచ్చు. అసలు కన్నడ సినిమా అంటే ఏంటో తెలియని ఇండస్ట్రీకే కాదు దేశానికి మొత్తం కన్నడ సినిమా కాలర్ ఎగరవేసేలా చేసింది.ఇక పాన్ ఇండియా సినిమాగా బాహుబలి, ఆర్ఆర్ఆర్ తరువాత కెజిఎఫ్ నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా మన దేశాన్ని దాటి జపాన్ వెళ్తోంది. అవును.. కెజిఎఫ్ 1,2 చాఫ్టర్లు జపాన్ లో రిలీజ్ కానున్నాయి. ఈ విషయాన్ని యష్ అధికారికంగా చెప్పాడు. జూలై 14 న ఈ సినిమా జపాన్ థియేటర్ లో సందడి చేయనున్నట్లు తెలిపాడు. ” నమస్తే జపాన్.. నా మూవీ కెజిఎఫ్ జపాన్ లో రిలీజ్ కానుంది.. కెజిఎఫ్ సినిమా అంటే.. స్ట్రెంత్, పవర్ అండ్ సంకల్పం.. వీటన్నింటితో పాటు.. ఎంతో వినోదం అండ్ యాక్షన్ కూడా.. అంతేకాదు.. రాఖీ మ్యాడ్ నెస్ కూడా .. త్వరగా థియేటర్ కు వెళ్లి పాసెస్ బుక్ చేసుకోండి” అని చెప్పుకొచ్చాడు. మరి జపాన్ లో ఈ సినిమా ఎలాంటి రికార్డులు అందుకుంది..? ఆర్ఆర్ఆర్ రికార్డులను దాటగలదా ..? అనేది చూడాలి.