* అదుపు తప్పి మినీ ట్రక్ బోల్తా
మూసాపేట మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారి పై పోలీస్ స్టేషన్ సమీపంలో అదుపుతప్పి చాక్లెట్ మినీ ట్రక్ బోల్తా పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ నుండి కొత్తకోటకు చాక్లెట్ బిస్కెట్ ఇతర తిను పదార్థాల సామాగ్రి లోడుతో వెళ్తున్న మినీ ట్రక్ టైర్ పేలిపోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది.దీంతో డ్రైవర్ సూరికి స్వల్ప గాయాలు అయ్యాయి. చాక్లెట్ కాటన్ లు చాలా వరకు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి పగిలిపోయాయి. వెంటనే స్పందించిన పోలీసు సిబ్బంది, ఎల్ అండ్ టి క్రేన్ సిబ్బంది క్రేన్ తో లారీని పక్కకు నెట్టారు. ఈ మేరకు విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ సిబ్బంది తెలిపారు.
* 55 కిలోల గంజాయి పట్టివేత
మూడు కార్లలో గంజాయిని లోడ్‌చేసి వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తున్న ఆరుగురిని భద్రాచలంలో పోలీసులు పట్టుకున్నారు. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నట్లు హైదరాబాద్‌కు చెందిన టాస్క్ ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ గణేశ్, భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఆబ్కారీ శాఖ సూపరింటెండెంట్ జ్ఞానయ్యతోపాటు, ఎన్ఫోర్స్ మెంట్సీఐలు సర్వేశ్వరరావు, లతీఫ్, భద్రాచలం సీఐ రహీమున్నీషాకు పక్కా సమాచారం అందింది.ఆదివారం ఉదయం భద్రాచలంలో తనిఖీలు చేపట్టగా, అదే టైంలో అటుగా వచ్చిన మూడు కార్లను ఆపి చెక్ చేయగా 55 కిలోల గంజాయి దొరికింది. జగిత్యాలకు చెందిన బొజ్జ మల్లేశ్, కస్తూరి గోవర్ధన్, దొంతర్వేని నర్సయ్య, తోకల లక్ష్మణ్, ఉత్తరాఖండ్‌కు చెందిన కిషన్రే, దీపక్ శేఖర్ జానే కలిసి ఒడిశాలోని ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. గంజాయి, కార్లను స్వాధీనం చేసుకుని, ఆరుగురిని అరెస్ట్‌చేసినట్లు ఆబ్కారీ శాఖ సూపరింటెండెంట్ జ్ఞానయ్య తెలిపారు.
టిప్‌టాప్‌గా రెడీ అయ్యి.. చక్కగా ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ ఏకంగా 15 మందిని వలలో వేసుకున్నాడో నిత్య పెళ్లికొడుకు. అనక డబ్బు బంగారంతో ఉడాయించేవాడు. ఇలా పెళ్లిళ్ల పేరుతో మహిళల జీవితాలతో ఆటలాడుకుంటున్న నిందితుడిని మైసూరు పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడిని బెంగళూరులోని బనశంకరిలో నివాసం ఉంటున్న మహేష్ కేబీ నాయక్ (35)గా పోలీసులు గుర్తించారు.
* మహిళపై అత్యంత పైశాచికత్యం
ఖగారియాలో దారుణ హత్య కేసు వెలుగు చూసింది. ఈ హత్యలో నిందితుల క్రూరత్వం అని పరిధులను దాటేసింది. హంతకులు మహిళ కళ్లను ఛేదించారు. మహిళ నాలుక, ప్రైవేట్ భాగాలను కూడా కత్తితో కోశారు. మహిళను పస్రాహా పోలీస్ స్టేషన్ పరిధిలోని దివంగత బబ్లూ సింగ్ భార్య 45 ఏళ్ల సులేఖా దేవిగా గుర్తించారు. భూ వివాదంలో మహిళ హత్యకు గురైనట్లు సమాచారం. ఈ సంఘటన పస్రహ దేవతకు చెందిన కర్ణ బహియార్‌లో అమలు చేయబడింది. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో సంచలనం నెలకొంది. 2014లో భూ వివాదంలో మహిళ భర్త బబ్లూ సింగ్, బావమరిది కరే సింగ్ కూడా హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన ఫూలుంగ్ సింగ్, మహేంద్ర సింగ్, రాజ్ దేవ్ సింగ్, శంకర్ సింగ్, కులో సింగ్ హత్యకు పాల్పడ్డారు. దీంతో వారందరిపై పస్రాహా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
* దిల్లీ ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య
దేశవ్యాప్తంగా ఐఐటీల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్య ఘటనలు కలకలం రేకెత్తిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఐఐటీ మద్రాస్‌లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా ఐఐటీ దిల్లీలో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీకి చెందిన ఆయుష్ అష్నా(20) అనే విద్యార్థి ఐఐటీ దిల్లీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం రాత్రి ఆ విద్యార్థి క్యాంపస్‌లోని ఉదయగిరి వసతిగృహంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాదిలో దేశంలోని ఐఐటీల్లో ఇప్పటివరకు ఆరుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
* హైదరాబాద్‌లో దారుణం
హైదరాబాద్‌లో దారుణ సంఘటన జరిగింది. దీక్షిత్ (21) అనే ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య సంఘటన కలకలం రేపింది. ఈ సంఘటన హైదరాబాద్ శివారు ప్రాంతమైన పాపిరెడ్డి నగర్లో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా దేవరుప్పల గ్రామానికి చెందిన సోమి రెడ్డి, కరుణ దంపతులు 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి పాపిరెడ్డి నగర్లో స్థిరపడ్డారు. వీరికి ఒక కుమార్తెతో పాటు, కుమారుడు దీక్షిత్ రెడ్డి ఉన్నారు.దీక్షిత్ రెడ్డి సికింద్రాబాద్ గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే దీక్షిత్ గత కొన్ని రోజులుగా మానసిక స్థితి బాగాలేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే గతంలో ఓసారి నిద్రమాత్రలు తీసుకున్నాడు. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఈ క్రమంలోనే చికిత్స తీసుకుంటున్న దీక్షిత్ గత కొన్ని రోజులుగా మానసిక సమస్యతో బాధపడుతున్నాడు.
* ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు
ప్రియురాలిని పట్టపగలు అందరూ చూస్తుండగా ఆమె ప్రియుడు కత్తితో పొడిచి చంపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గురుగ్రామ్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌కు చెందిన 19 ఏళ్ల యువతికి ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొన్నాళ్లు గడిచాక ఇద్దరు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకోగా.. పెద్దలు వారిద్దరికి నిశ్చితార్థం కూడా చేశారు. అయితే ఏమైందో తెలియదు కానీ యువతి అతడితో పెళ్లికి నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే యువతిని వేధించడం మొదలుపెట్టాడు ఆ యువకుడు. తనను పెళ్లి చేసుకోవాలని, లేకుండా చంపేస్తానంటూ పలుమార్లు బెదిరించాడు. కానీ ఆ యువతి ఇవేమీ పట్టించుకోలేదు.ఈ క్రమంలోనే ఫ్రెండ్ తో బయటకు వచ్చిన యువతిని అడ్డగించిన యువకుడు.. మాట్లాడుతానంటూ దగ్గరకు వచ్చి కత్తితో ఆమెపై దాడిగి దిగాడు. ఆమె కడుపులో, మెడపై కత్తితో ఇష్టమొచ్చినట్లు దాడి చేశాడు. దీంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. కాగా ఘటన జరగుతున్న సమయంలో అక్కడ చాలా మందే ఉన్నారు. అయితే అతడి చేతిలో కత్తిని చూసి వారంతా భయంతో పరుగులు పెట్టారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా తనతో పెళ్లికి నిరాకరించినందుకే ఆమెను చంపేసినట్ల నిందితుడు రాజ్ కుమార్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
* ఆటోలో బాలింతపై అత్యాచారం
మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఆటోలో మహిళా ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మహిళ సీబీడీ బేలాపూర్ నవీ ముంబై నుంచి గోరేగావ్‌కు వస్తున్నట్లు సమాచారం. దారిలో ఆటో డ్రైవర్ ఆమెను ఆరే అడవికి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. అత్యాచారం అనంతరం నిందితులు మహిళను కాలితో తన్నారు. రెండు నెలల క్రితమే ఆ మహిళకు ప్రసవం జరగడంతో కడుపులోని కుట్లు చిరిగిపోయాయి. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని డ్రైవర్ మహిళను బెదిరించాడు.
* జిమ్‌కి వెళ్లి వచ్చాక గుండె పోటు
జిమ్‌కి వెళ్లి వచ్చాక గుండెపోటుతో శ్రీధర్ (31) అనే యువకుడు హఠాత్తుగా మృతి చెందారు. ఈ ఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. బాలపేటకకు చెందిన శ్రీధర్ వ్యాయామం చేసి ఇంటికి వచ్చిన కొద్ది సేపటికి తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ఆయన్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయారు. ఆయన గతంలో జరిగిన ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందారు. మృతుడి తండ్రి మానుకొండ రాధాకిశోర్ గతంలో కాంగ్రెస్ నాయకుడు, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మన్‌గా పనిచేశారు. శ్రీధర్ మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలోని అల్లిపురంలో ఆదివారం ఉదయం నాగరాజు (33) అనే యువకుడు కూడా ఇలాగే గుండెపోటుతో మృతి చెందాడు.
* విశాఖలో బాలికపై అత్యాచారం
విశాఖలో 14 ఏళ్ల బాలికపై స్కూలు అటెండర్ సత్యారావు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన సంచలనంగా మారింది. ఆమెతో సన్నిహితంగా ఉండగా తీసిన ఫొటోలు, వీడియోలతో అతడు బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అతని నలుగురు స్నేహితులూ అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తుండగా.. మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, విచారిస్తున్నట్లు తెలుస్తోంది. బాలిక ప్రవర్తనలో మార్పులు రావడంతో గమనించి తల్లి ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.