Politics

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎంగా సీతక్క…తానా సభలో కీలక ప్రకటన

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎంగా సీతక్క…తానా సభలో కీలక ప్రకటన

కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ నిర్ణయం అనుగుణంగా అందరం కలిసి పని చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అవసరమైతే సీతక్కను కూడా ముఖ్యమంత్రి చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం, అమరావతిని కట్టేది కాంగ్రెస్ పార్టీనే అని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కోసం ఏదైనా చేస్తామని, కాంగ్రెస్ పార్టీని పవర్‌లోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి నిత్యం శ్రమిస్తూనే ఉంటాడని హామీ ఇచ్చారు. ప్రతి నిమిషం పార్టీ కోసమే పనిచేస్తానన్నారు. మరికొద్ది రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నారైలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ, సహాయ సహకారాలు అందించాలని కోరారు. అమెరికాలో జరిగిన తానా సభల్లో దళితులు, గిరిజనులకు ఉప ముఖ్యమంత్రి పోస్టు ఇవ్వాలని ఎన్నారైలు రేవంత్‌ను కోరగా, కాంగ్రెస్ పార్టీ అందరికీ అవకాశాలు ఇస్తుందని, అవసరమైతే సీతక్కను ముఖ్యమంత్రిని కూడా చేస్తుందని స్పందించారు.