లైబ్రరీ నుంచి పుస్తకాలను ఇంటికి తెచ్చుకుని చదవడం గురించి అందరికీ తెలిసింది. వాళ్లు ఇచ్చిన గడువు తీరిపోయాక ఒక్కోసారి ఇచ్చేస్తాం. కొన్నిసార్లు గడువు దాటిన సందర్భాలు ఉంటాయి. ఐతే ఇక్కడొక లైబ్రరీలోని పుస్తకం ఏకంగా రెండు, మూడు ఏళ్లు కాదు ఏకంగా 100 ఏళ్ల తర్వాత తిరిగి లైబ్రెరికీ చేరుకుంది.ఈ ఆశ్చర్యకరమైన ఘటన యూఎస్‌లోని మసాచుసెట్స్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని మసాచుసెట్స్‌లో న్యూ బెడ్ఫోర్డ్ ఫ్రీ పబ్లిక్ లైబ్రరీ నుంచి అరువు తెచ్చుకున్న ఓ పుస్తకం దాదాపు 100 ఏళ్ల తర్వాత లైబ్రరీకి వచ్చింది. ఈ ఘటన అక్కడ ఉన్న లైబ్రెరియన్లను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అత్యంత అరుదైన పుస్తకాలను ముద్రించే అవెస్ట్ వర్జీనియా యూనివర్సిటీ లైబ్రరీ అసిస్టెంట్ డైరెక్టర్ స్టీవర్ట్ ప్లీ కొన్ని పుస్తకాలను సదరు గ్రంథాలయానికి విరాళంగా ఇచ్చిన కొద్ది రోజుల తర్వాతే ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇక లైబ్రరీకీ తిరిగి వచ్చిన పుస్తకం పేరు “ఎలెమెంటరీ ట్రీటైజ్ ఆన్ ఎలక్ట్రిసిటీ” అనే పుస్తకం. దీని రచయిత జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్.
న్యూ బెడ్ఫోర్డ్ ఫ్రీ పబ్లిక్ లైబ్రరీలో ఈ పుస్తకం ఉండేది. ఈ పుస్తకాన్ని 1904లో ఎవరో జారీ చేశారు. ఆ పుస్తకాన్ని ప్రస్తుతం ఎవరో వ్యక్తి తిరిగి లైబ్రరీకి హ్యండోవర్ చేశారు. అయితే ఆ పుస్తకం చెక్కు చెదరకుండా బాగానే ఉండటం విశేషం. ఈ మేరకు బెడ్ఫోర్డ్ పబ్లిక్ లైబ్రరీ డైరెక్టర్ ఒలివియా మెలో మాట్లాడుతూ..ఈ పుస్తకాన్ని చాలా మంచి స్థితిలోనే తీసుకువచ్చి అరలో ఉంచారు. ఏ పుస్తకం అయినా గడవుకి ఇంకాస్త ఆలస్యంగా చేరిన సందర్భాలు కోకొల్లలుగా ఉంటాయి. అదీకూడా మహా అయితే 10 లేదా 15 సంవత్సరాలు మాత్రమే ఆలస్యంగా తిరిగి లైబ్రరీకి చేరుకునే అవకాశం ఉంటుది.
కానీ మరి ఇంత దారుణంగా వందేళ్ల తర్వాత తిరిగి రావడం ఇదే మొదటిసారి. ఈ పుస్తకాన్ని 1881లో ముద్రించారు. చరిత్రలో దీనికి గొప్ప స్థానం ఉంది. ఎందుకంటే ఈ పుస్తకం విద్యుదయస్కాంత రంగంలో ప్రముఖ సహయకారి అయిన రచయిత జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్ మరణం తర్వాత వచ్చిన పుస్తకమే ఇది. చెప్పాలంటే ఇది సరిగ్గా 119 ఏళ్లు తిరిగి లైబ్రరీకి చేరుకుంది. ఇంకో వందేళ్లు ఇలానే ఉంటుంది. ఎందుకంటే ముద్రించిన పుస్తకం ఎప్పటికి విలువైనదే. అని సదరు లైబ్రరీ డైరెక్టర్ ఒలివియా నమ్మకంగా చెబుతోంది.