ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశాల్లో ఒకటైన స్కాట్లాండ్ (UK) లోని ఎడింబరో లో అంగరంగ వైభవంగా మొట్టమొదటి అష్టావధానం శ్రీ ప్రణవ పీఠాధిపతి (ఏలూరు) బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే నిన్న శ్రీ విజయ్ కుమార్ రాజు పర్రి గారు నిర్వహించారు. తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎడింబరో హిందు మందిర్ వేదికయ్యింది. వందలాది తెలుగు ప్రజలు పొరుగు నగరాల నుండి కూడా ఏడింబరో విచ్చేసి ఆసక్తిగా తిలకించడం విశేషం.
త్రిభాషా మహాసహస్రావధాని వద్దిపర్తి పద్మాకర్ గారు, నిర్వాహకులు విజయ్ కుమార్ రాజు పర్రి గారు, స్కాట్లాండ్ తెలుగు సంఘం చైర్మన్ శ్రీమతి మైథిలి కెంబూరి గారు కార్యక్రమాన్ని జ్యొతి ప్రజవల చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి పృచ్ఛకులుగా తెలుగు భాషను అమితంగా ప్రేమిచే వారు కావడం వలన 12 మంది దివ్యమైన సూర్యులతో ప్రకాశిస్తూ సాగిందీ కార్యక్రమం.
సమస్యాపూరణం – శ్రీ నాగ ప్రసాద్ మంగళంపల్లి గారు
దత్తపది – శ్రీ రంజిత్ నాగుబండి గారు
వర్ణన – శ్రీమతి సాయికుమారి దొడ్డ గారు
నిషిద్ధాక్షరి – శ్రీమతి శైలజ గంటి గారు
న్యస్తాక్షరి – శ్రీమతి హిమబిందు జయంతి గారు
ఆశువు – శ్రీ అనంత రామానంద్ గార్లపాటి గారు, శ్రీమతి మమత వుసికల గారు
పురాణ పఠనం – శ్రీ విజయ్ కుమార్ రాజు పర్రి గారు, శ్రీ మిథిలేష్ వద్దిపర్తి గారు, శ్రీ పండరి జైన్ కుమార్ పోలిశెట్టి గారు
అప్రస్తుత ప్రసంగం – శ్రీ సత్యశ్యాం కుమార్ జయంతి గారు, శ్రీ నిరంజన్ నూక గారు
ఆద్యంతం రసవత్తరముగా సాగిన ఈ కార్యక్రమమునకు విమర్శనాత్మక విశ్లేషణ శ్రీ అయ్యగారి ప్రసాద్ గారు చేశారు.
కార్యక్రమ అనంతరం అవధాని సతీసమేత వద్దిపర్తి పద్మాకర్ గార్లని నిర్వాహకులు విజయ్ గారు మరియు పృచ్ఛకులు పట్టు శాలువాతో, సన్మాన పత్రంతో, పట్టు బట్టలతో, పూలు పండ్లతో సత్కరించారు.
ఆద్యంతం రసవత్తరముగా సాగిన ఈ చివరగా నిర్వాహకులు విజయ్ గారు అవధాని గారికి, పృచ్ఛకులకు, వాలంటీర్లకు ధన్యవాదాలు తెలుపగా, వేడుకను మంగళహారతితో ముగించారు.
సాయంత్రం ‘శ్రీ కృష్ణ లీలలు అంశం మీద భక్తి ప్రవచనాలు కార్యక్రమం అత్యద్భుతంగా జరిగింది.
కార్యక్రమాలను క్రింది లంకెలలో వీక్షించండి.
Ashtavadhanam:https://fb.watch/lGbwVREE9j
Pravachanalu:https://fb.watch/lGCnvIaqFg