Politics

జీవో-192ను రద్దు చేసిన ఏపీ హైకోర్టు

జీవో-192ను రద్దు చేసిన ఏపీ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు జూనియర్‌ కళాశాలల తనిఖీకి కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. కళాశాలల తనిఖీకి కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కారు జీవో 192ను తీసుకొచ్చింది. ప్రభుత్వ జీవోను జూనియర్‌, ఒకేషనల్‌ కళాశాలల యాజమాన్యాలు ఉన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశాయి. కమిటీ నియామకం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, కళాశాలల్లో సౌకర్యాల పరిశీలనకే కమిటీ వేశామని ఇంటర్‌ బోర్డు కోర్టుకు తెలిపింది. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం.. ఇంటర్‌, విద్యా చట్టాలకు వ్యతిరేకంగా జీవో ఉందని పేర్కొంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను హైకోర్టు రద్దు చేసింది.