National Council of Asian Indian Associations(NCAIA)-GWTCS సంస్థల సమన్వయంలో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో 28 ప్రవాస సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భారత మాజీ ఉప-రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి భారతదేశం నిర్వచనమని, ఐక్యతతో దేశాభ్యుదయానికి చేయూతనందించటమే భారతీయతకు ప్రతీక అని పేర్కొన్నారు. పరాయి దేశంలో కష్టపడి పురోగతి సాధించి నలుగురితో పంచుకోవాలని సూచించారు. మాతృభాష, మాతృభూమి, మాతృమూర్తిని మించిన ఆస్తి, అస్తిత్వం లేవన్నారు. తానా మాజీ అధక్షుడు సతీష్ వేమన, ప్రసాద్ అడపా, కృష్ణ లామ్, సునీల్ సింగ్, కృప సింగ్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, యాష్ బొద్దులూరి, భాను మాగులూరి, రవి అడుసుమిల్లి, సుధీర్ కొమ్మి, శ్రీనివాస్ గంగా, సుధా పాలడుగు, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.