NRI-NRT

వేమన నివాసానికి వెంకయ్య

వేమన నివాసానికి వెంకయ్య

తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ నివాసంలో భారత మాజీ ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వర్జీనియా-డీసీ-మేరీల్యాండ్‌లకు చెందిన ప్రవాస తెలుగు, భారతీయులను కలుసుకున్నారు. ప్రవాసుల వివరాలను అడిగి తెలుసుకున్న వెంకయ్య, వీరిలో కొంత మంది తల్లిదండ్రులతో ఫోనులో సంభాషించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.