Kids

స్మార్ట్‌ఫోన్‌కు బానిసై మతిస్థిమితం కోల్పోయిన బాలుడు

స్మార్ట్‌ఫోన్‌కు బానిసై మతిస్థిమితం కోల్పోయిన బాలుడు

ఈ రోజుల్లో ఏ ఇంట చూసినా పసిపిల్లల చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు కనిపిస్తున్నాయి. ఇవ్వకపోతే మారాం చేసి మరీ తల్లిదండ్రుల నుంచి తీసుకొంటున్నారు. కాస్త ఎదిగిన పిల్లలు ప్లేస్టోర్ల నుంచి వివిధ రకాల ఆటలు ఇన్‌స్టాల్‌ చేసి ఆడుతూ చాలా సమయం వాటితోనే గడుపుతున్నారు. ఇలా స్మార్ట్‌ఫోన్లకు బానిసైన పిల్లల్లో కొందరు అరుదైన వ్యాధుల బారినపడుతున్నారు. రాజస్థాన్‌లో అల్వార్‌కు చెందిన దాదాపు పదేళ్ల బాలుడు మతిస్థిమితం కోల్పోయాడు. ఇతనికి ప్రత్యేక పాఠశాలలోని నిపుణుల సాయంతో చికిత్స అందిస్తున్నారు. ఈ బాలుడు ఎక్కువ సమయం ఫ్రీఫైర్‌ ఆటలోనే గడిపేవాడని తల్లిదండ్రులు తెలిపారు. ఇలా ఆడుతూ ఓసారి ఓడిపోయాడు. దాన్ని తట్టుకోలేక మతిస్థిమితం కోల్పోయాడు. ప్రత్యేకంగా భౌతిక ఆటలు ఆడిస్తూ, అతడికి నయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ పాఠశాలలోని భవానీశర్మ తెలిపారు.