ఇటీవల కేంద్రమంతి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జీఎస్టీ మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశంలో మల్టీప్లెక్స్‌లలో స్నాక్స్, కూల్ డ్రింక్స్, పాప్‌కార్న్ మొదలగు తినుబండరాలపై 18 శాతం ఉన్న GSTని 5 శాతానికి తగ్గించారు. దీంతో మల్టీప్లెక్స్‌లలో వీటిపై ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ నిర్ణయం పట్ల మల్టీప్లెక్స్ యజమాన్యాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ధరలు ఎక్కువగా ఉండటం వలన ప్రేక్షకులు కూడా తక్కువగా తినుబండరాలను కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఈ నిర్ణయంతో ధరలు తగ్గుతాయని అన్నారు.అయితే ఈ తగ్గింపు ఆన్‌లైన్ ద్వారా టికెట్‌తో పాటు ఆహరపదార్థాలను బుకింగ్ చేసే వారికి మాత్రం వర్తించదు. చాలా మంది ఆన్‌లైన్‌లో సినిమా టికెట్‌తో పాటు, ఆహర పదార్థాలను కూడా బుకింగ్ చేస్తారు. అలా ఆన్‌లైన్ ద్వారా కొనే వారికి జీఎస్టీ 18 శాతం ఉంటుంది. అదే సినిమా హాల్లోనే ఆహార పదార్థాలను కొంటే మాత్రం వారికి 5 శాతం జీఎస్టీ ఉంటుంది.