Politics

సినీ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న షర్మిల కుమారుడు

సినీ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న షర్మిల కుమారుడు

వైఎస్ షర్మిల. తెలంగాణలో తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రజల్లో తిరుగుతూ పాదయాత్ర చేస్తూ వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా వైఎస్ షర్మిల కొడుకును సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోందని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి ఎయిర్ పోర్ట్‌లో కనిపించారు.మంచి కట్ అవుట్‌తో చూడడానికి చాలా పర్ఫెక్ట్‌గా హీరోగా అనిపించాడు. దీంతో ప్రతి ఒక్కరు కూడా రాజారెడ్డి హీరోగా ఇండస్ట్రీ లోకి వస్తే బాగుండు అని కామెంట్ చేశారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే.. ఇప్పటికే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రాజారెడ్డికి యాక్షన్ డ్రామా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్‌గా సాగే ఒక కథను సిద్ధం చేశారట. షర్మిల కుటుంబ సభ్యులకు కూడా కథ బాగా నచ్చడంతో త్వరలోనే రాజారెడ్డి ఎంట్రీకి సిద్ధం చేస్తున్నారట. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.