NRI-NRT

షార్లెట్‌లో ఎన్నారై తెదేపా సదస్సు విజయవంతం

షార్లెట్‌లో ఎన్నారై తెదేపా సదస్సు విజయవంతం

అమెరికా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు టిడి జనార్ధన్‌, గాలి భాను ప్రకాశ్‌, పులివర్తి నాని, ముళ్ళపూడి బాపిరాజు, డా.రవి వేమూరులతో షార్లెట్‌లో ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ నాయకులు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నారైలు కూడా కృషి చేయాలని కోరారు. చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పులివర్తి నాని మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో టీడిపి గెలవడం ఖాయమని అన్నారు. టి.డి. జనార్ధన్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలను తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికా, ఇతర దేశాల్లో కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గాలి భానుప్రకాశ్‌ మాట్లాడుతూ తన తండ్రి గాలి ముద్దుకృష్ణమనాయుడుకు నగరి నియోజకవర్గ ప్రజలతో ఉన్న సత్సంబంధాల కారణంగా ఈసారి నగరిలో తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయమని చెప్పారు. ముళ్ళపూడి బాపిరాజు మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని తెలుగుదేశం పార్టీని గెలిపించడం ఖాయమని చెప్పారు. షార్లెట్ టీడిపి నాయకులు రమేష్‌ మూకుళ్ళ, నాగ పంచుమర్తి, బాలాజి తాతినేని, సతీష్‌ నాగభైరవ, ఠాగూర్‌ మల్లినేని, తులసీరాం పాశం, దేవ నర్రావుల, మాధురి ఏలూరి తదితరులు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.