న్యూయార్క్‌లో ప్రవాస భారతీయులతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమావేశమయ్యారు. న్యూయార్క్ భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అమెరికా అభివృద్ధిలో, ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో ప్రవాస భారతీయుల కృషి కీలకమైనదని ఆయన కొనియాడారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మోడీ పర్యటన బలోపేతం చేసిందని అన్నారు. న్యూయార్క్ భారత కాన్సులేట్ జనరల్ రణధీర్ జైశ్వాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశానికి కృష్ణా రెడ్డి ఏనుగుల, విలాస్ జంబుల, శ్రీనివాస్ దార్గుల, రఘువీర్ రెడ్డి, రామ్ వేముల తదితరులు హాజరయ్యారు.
న్యూయార్క్ ప్రవాసులతో కిషన్‌రెడ్డి భేటీ
Related tags :