ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. ఆ దేశానికి చేరుకున్న మోదీకి ఆ దేశ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మోదీ ప్రవాస భారతీయులతో సమావేశమై.. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఇచ్చిన ప్రైవేట్ డిన్నర్‌కు హాజరయ్యారు. ఫ్రాన్స్ పర్యటనలో నరేంద్ర మోదీకి మరో అత్యున్నత పురస్కారం లభించింది. ఆయనను ఆ దేశ అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లిజియాన్ ఆఫ్ హానర్‌ను ఇచ్చి ఫ్రాన్స్ గౌరవించింది. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్.. ఈ అవార్డును మోదీకి ప్రదానం చేశారు.భారత్‌లో అత్యంత విజయవంతమైన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐను ఇక ఫ్రాన్స్‌లో ఉపయోగించుకోవచ్చని మోదీ ప్రకటించారు. భారత్- ఫ్రాన్స్ UPIని ఉపయోగించడానికి అంగీకరించాయని ఆయన తెలిపారు. త్వరలో ఈఫిల్ టవర్ నుంచి ఫ్రాన్స్‌లో యూపీఐ సేవలను ప్రారంభిస్తామని ప్రకటించారు. ఫ్రాన్స్‌లో పర్యటించే భారతీయ పర్యటకులు ఇక రూపాయాల్లోనూ డిజిటల్ పేమెంట్స్ చేయవచ్చంటూ మోదీ ప్రకటించారు. నగదు రహిత తక్షణ చెల్లింపులో ఇదీ భారీ ఆవిష్కరణగా పేర్కొన్నారు.