NRI-NRT

ఏపీకి నేడు అవసరం ఆధారం ప్రవాసులే-డల్లాస్ ఎన్నారై తెదేపా సదస్సులో వక్తలు

ఏపీకి నేడు అవసరం ఆధారం ప్రవాసులే-డల్లాస్ ఎన్నారై తెదేపా సదస్సులో వక్తలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రవాసుల చురుకైన పాత్ర అవసరంతో పాటు ఆధారం కూడా అని తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. డల్లాస్‌లో శనివారం సాయంత్రం నిర్వహించిన ఎన్నారై తెదేపా సదస్సులో వీరు పాల్గొని ప్రసంగించారు. పులివెందుల ముఖ్యమంత్రి పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దూరంగా జరిగిందని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి తెలుగుదేశాన్ని గెలిపించాల్సిన బాధ్యత అందరిపై సమిష్ఠిగా ఉందని నేతలు పేర్కొన్నారు. NRITDP.com వెబ్‌సైట్ ద్వారా తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకుని పార్టీ గెలుపుకు విదేశాల నుండి అందుబాటులో ఉన్న సాంకేతిక వనరుల ఆధారంగా తోడ్పడాలని కోరారు. ఎన్‌టీఆర్ శతజయంతి ఉత్సవాలు అమెరికావ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. ప్రసంగించిన వారిలో డా.పెమ్మసాని చంద్రశేఖర్, డా.వేమూరు రవికుమార్, కోమటి జయరాం, తొండెపు దశరధ జనార్ధన్, గాలి భానుప్రకాశ్, పరిటాల శ్రీరామ్ తదితరులు ఉన్నారు. “సైకో పాలన పోవాలి – సైకిల్ పాలన రావాలి” నినాదాలు చేశారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో తెదేపా అభిమానులు, కార్యకర్తలు, ప్రవాసులు హాజరయ్యారు.