Politics

గంజాయి దందాపై ఏపీ గవర్నర్‌కు లోకేశ్ ఫిర్యాదు

గంజాయి దందాపై ఏపీ గవర్నర్‌కు లోకేశ్ ఫిర్యాదు

ఏపీ గవర్నర్‌కు నారా లోకేశ్ ఫిర్యాదు చేశారు. ఏపీలో విచ్చలవిడి గంజాయి లభ్యతపై లోకేష్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేశారు. డ్రగ్స్ సరఫరాలో AP అగ్రస్థానంలో ఉందని DRI నివేదికలు చెబుతున్నాయని తెలిపారు.దేశంలో ఎక్కడా గంజాయి దొరికిన ఆ మూలాలు APకి ముడిపడి ఉన్నాయని, రాష్ట్రం డ్రగ్స్ కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఇక అంతకు ముందు నారా లోకేష్‌ మాట్లాడుతూ…అమ్మకు అన్నం పెట్టని జగన్ అంగన్వాడీలకి బంగారు గాజులు చేయిస్తాడా? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ యువతకి ఉద్యోగాలు కల్పించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని… విశాఖని ఐటీ క్యాపిటల్ గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.