విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు కొత్త సంవత్సరం సందర్భంగా ప్రకటించే పతకాలను రాష్ట్ర హోంశాఖ శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం జాబితాను వెలువరించింది. 718 మంది ఈ పతకాలకు ఎంపికయ్యారు. పోలీస్ విభాగంలో శౌర్య పతకాల విభాగంలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ పి.సతీష్, ఇంటెలిజెన్స్‌లో ఎస్సై కరీం, ఏఎస్సై శివశంకర్, హెడ్‌కానిస్టేబుళ్లు ఖాజా మొయినుద్దీన్, రాజవర్ధన్‌రెడ్డి, అంబేకర్ బాలాజీరావు, కానిస్టేబుళ్లు మోహన్, కిరణ్‌కుమార్, లక్ష్మీనారాయణ, వీరస్వామి, అలీముద్దీన్ దక్కించుకున్నారు. అలాగే రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల విభాగంలో అసెంబ్లీ ఫైర్‌స్టేషన్ ఏడీఎఫ్‌వో ధనుంజయ్‌రెడ్డి, సికింద్రాబాద్, గౌలిగూడ ఫైర్‌స్టేషన్ల ఆఫీసర్లు మోహన్‌రావు, ప్రవీణ్‌కుమార్, మొఘల్‌పురా, గౌలిగూడ, అసెంబ్లీ, సికింద్రాబాద్ ఫైర్‌స్టేషన్ల ఫైర్‌మెన్లు వెంకటేశ్వరరాజు, అస్గర్, టి.హరికృష్ణ, ఎం.హరికృష్ణలకూ ఈ పురస్కారం లభించింది.
పోలీస్‌శాఖలో 16మందికి, రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల విభాగంలో ఒకరికి, ఎస్పీఎఫ్‌లో ఒకరికి మహోన్నత సేవా పతకాలు దక్కాయి.పోలీస్ శాఖలో 94 మందికి, ఏసీబీలో ముగ్గురికి, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో ఇద్దరికి, రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల విభాగంలో ముగ్గురికి, ఎస్పీఎఫ్‌లో ముగ్గురికి ఉత్తమ సేవా పతకాలు లభించాయి.పోలీస్ శాఖలో 51మందికి కఠిన సేవా పతకాలు దక్కాయి.పోలీస్ శాఖలో 473మందికి, ఏసీబీలో 22 మందికి, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో ఇద్దరికి, రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల విభాగంలో 14మందికి, ఎస్పీఎఫ్‌లో 15మందికి సేవా పతకాలు లభించాయి.