హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. మరో 15 రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. మెట్రో, ఎంఎంటీఎస్ రైలు లేని మార్గాలకు ప్రాధాన్యం ఇస్తూ.. ఐటీ కారిడార్‌ను అనుసంధానం చేసేందుకు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే కంటోన్మెంట్, మియాపూర్ డిపోలకు ఈ బస్సులను కేటాయిస్తూ రూట్లను నిర్ణయించారు.రూట్లు ఇవే..!సికింద్రాబాద్ – పంజాగుట్ట – జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు – ఫిల్మ్‌నగర్ – ఉస్మానియా కాలనీ – మణికొండ రూటులో తిరుగుతున్న 47ఎల్ మార్గంలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. జేబీఎస్ – సికింద్రాబాద్ – తార్నాక – ఉప్పల్ – ఎల్‌బీనగర్ – ఇబ్రహీంపట్నం మార్గంలో కూడా కంటోన్మెంట్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. మియాపూర్ డిపోకు కేటాయించే వాటిని బాచుపల్లి – జేఎన్‌టీయూ – కేపీహెచ్‌బీ – హైటెక్ సిటీ – బయోడైవర్సిటీ – గచ్చిబౌలి – వేవ్‌రాక్ మార్గాల్లో తిరగనున్నాయి. ప్రగతినగర్ – జేఎన్‌టీయూ – హైటెక్‌సిటీ – బయోడైవర్సిటీ – గచ్చిబౌలి – వీబీఐటీ మార్గాల్లో నడవనున్నాయి..