Devotional

పండగలాంటి తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్

పండగలాంటి తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ తీపి కబురు అందించింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి రోజుకు 4,000 చొప్పున ఆదనపు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేస్తామని వెల్లడించింది. త్వరలోనే టికెట్ విడుదల తేదీని ప్రకటిస్తామంది. కాగా, వేసవి ముగిసి శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య సాధారణంగా ఉన్న నేపథ్యంలో ఆదనపు కోట ఇచ్చేందుకు సిద్ధమైంది.కాగా, తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న 86,170 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే, 31,128 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.4.13 కోట్లు గా నమోదు అయింది.