హైదరాబాద్ బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కన్నులపండువగా జరుగుతున్నది. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు తరలివస్తున్నారు. మహంకాళిని దర్శించుకోవడానికి పెద్దసంఖ్యలో లైన్లలో వేచిఉన్నారు. కాగా, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.