Health

కాంగోలో మంకీపాక్స్ విజృంభణ

కాంగోలో మంకీపాక్స్ విజృంభణ

డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌ కాంగో (డీఆర్‌సీ)లో మంకీపాక్స్‌ కేసులు విజృంభిస్తున్నాయి. గత ఏడాది కాలంగా మంకీపాక్స్‌ అనుమానిత కేసులు 5,236 నమోదు కాగా, 229 మరణాలు సంభవించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది.ఈ ఏదాది జనవరి 1 నుంచి జూన్‌ 25 వరకు 70 శాతం అనుమానిత కేసులు, 72 శాతం మరణాలు 1 నుంచి 15 ఏండ్ల వారికి సంభవించినట్టు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. వన్యప్రాణుల నుంచి సంక్రమించే ఈ వ్యాధి జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. మంకీపాక్స్‌ అంటే స్మాల్‌ పాక్స్‌ (మశూచి) తరహా ఇన్‌ఫెక్షన్‌. మశూచితో పోలిస్తే తీవ్రత తక్కువ ఉంటుంది.