హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్టులకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) బంపర్ ఆఫర్ ప్రకటించింది. విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులలో కనీసం ముగ్గురు కలిసి జర్నీ చేస్తే టిక్కెట్లపై సబ్సిడీ లభిస్తుందని తెలిపింది. మూడు అంతకు మించి ఎందరు ఎందరు ప్రయాణించినా టికెట్ట్పై మొత్తం ఛార్జీల్లో 10శాతం వరకు సబ్సిడీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ వెంకన్న తెలిపారు. కుటుంబాలతో కలిసి ఎయిర్‌పోర్టుకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఖర్చు తగ్గించడం కోసం ఈ సదుపాయాన్ని కల్పించినట్లు చెప్పారు. క్యాబ్‌లు, ఇతర ప్రైవేటు వాహనాల పోటీని ఎదుర్కోవడానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.ప్రస్తుతం పలు రూట్లలో ఎయిర్‌పోర్టుకు చేరుకోవడానికి కనిష్ఠంగా రూ.50 నుంచి గరిష్ఠంగా రూ.300 వరకు టికెట్‌ఛార్జీలు ఉన్నాయి. త్వరలో మరికొన్ని 20 ఏసీ బస్సులను ఎయిర్‌పోర్టుకు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.