WorldWonders

ఈ అలవాట్లు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగం ఇవ్వరు

ఈ అలవాట్లు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగం ఇవ్వరు

చైనాలోని ఒక కంపెనీ పెట్టిన షరతుల ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైనాలోని ఓ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ధూమపానం, మద్యపానం, మాంసం తినని వ్యక్తుల కోసం వెతుకుతున్నట్లు ఒక ప్రకటన చేసింది. కంపెనీ కార్యకలాపాలు, మర్చండైజింగ్ లో ఉద్యోగుల కోసం 5,000 యువాన్ (US$700) నుంచి ప్రారంభమయ్యే నెలవారీ జీతంతో పాటు ఉచిత వసతిని ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఉద్యోగ అభ్యర్థులు ధూమపానం, మద్యం సేవించడంతో పాటు మాంసాహారం తినకూడదని షరతు విధించింది.ఈ డిమాండ్‌లు నిర్దిష్ట అభ్యర్థుల పట్ల పక్షపాతంతో పాతుకుపోయినవి కావు.. కానీ కంపెనీ కార్పొరేట్ సంస్కృతికి సంబంధించినవి అని వివరించారు. ఆరోగ్యకరమైన కార్పొరేట్ సంస్కృతిని నెలకొల్పేందుకు కంపెనీ క్యాంటీన్‌లో ఎలాంటి మాంసంకు సంబంధించిన వంటకాలు అందించడం లేదని ఉద్యోగులకు వెల్లడించారు. అయితే, ఉద్యోగులపై కంపెనీ తన సంస్కృతిని బలవంతంగా రుద్దలానుకోవడం పద్దతి కాదని దీనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు.

అయితే, ఈ కార్పోరేట్ సంస్కృతిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. కంపెనీ డిమాండ్‌పై పలువురు హర్షం వ్యక్తం చేశారు. మరి కొందరు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీకి ఉద్యోగోలు కావాలా.. సన్యాసులు కావాలంటూ ప్రశ్నించారు. ఇలాంటి షరుతలతో మీ కంపెనీ తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందని నెటిజన్స్ అంటున్నారు. అయితే, గతంలో కూడా ఓ కంపెనీ ఇద్దరు అభ్యర్థులు పచ్చబొట్లు తొలగించే వరకు వారిని ఉద్యోగాల్లోకి రావద్దంటూ నియమం పెట్టడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. కార్పోరేట్ ఆఫీసుల్లో కూడా ఇలాంటి సాంస్కృతి మంచిది కాదు.. ఈ వివక్ష తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని అన్నారు.