WorldWonders

3 నెలలపాటు నడి సంద్రంలో చిక్కుకుపోయాడు

3 నెలలపాటు నడి సంద్రంలో చిక్కుకుపోయాడు

సుమారు మూడు నెలల పాటు సముద్రంలో నిస్సహాయ స్థితిలో పెంపుడు కుక్కతో గడిపిన ఓ వ్యక్తి ఎట్టకేలకు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. నమ్మశక్యంకాని ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.తిమోతీ లిండ్సే షడ్డక్‌(54) అనే ఆ్రస్టేలియా వాసి పెంపుడు కుక్క బెల్లాతో కేటమారన్‌ రకం పడవలో పసిఫిక్‌ సముద్రంలో విహరిస్తున్నాడు. ఆ సమయంలో ఆ పడవ మరమ్మతుకు గురయింది. అలా సముద్ర జలాల్లో తీరానికి 1,200 మైళ్ల దూరంలో ఆ ఇద్దరూ మూడు నెలలుగా ఉండిపోయారు. అనూహ్యంగా ఇటీవల అటుగా టునా చేపల వేటకు వెళ్లిన మెక్సికో వాసుల కంట పడ్డారు.