చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేశ్ రూపొందించిన ‘భోళాశంకర్’ విడుదలకు ముస్తాబవుతోంది. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాలో, చిరంజీవి సరసన నాయికగా తమన్నా అలరించనుంది. ఆయన చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక్కో అప్ డేట్ ను వదులుతూ వస్తున్నారు. అలా కొంతసేపటి క్రితం ఒక సాంగ్ ప్రోమోను వదిలారు ‘మిల్కీ బ్యూటీ .. నువ్వే నా స్వీటీ’ అంటూ ఈ పాట సాగుతోంది. మహతి స్వరసాగర్ స్వరపరిచిన ఈ పాటను, చిరంజీవి – తమన్నా బృందంపై మంచు కొండల నేపథ్యంలో చిత్రీకరించారు. ఈ పాటలో మెగా స్టార్ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఇక తమన్నా గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. పూర్తి పాటను రేపు సాయంత్రం 4:05 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. 2015లో అజిత్ నుంచి వచ్చిన సూపర్ హిట్ ‘వేదాళం’ చిత్రానికి ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే.