NRI-NRT

NTRకు లాస్ఏంజిల్స్ ప్రవాసుల ఘననివాళి

NTRకు లాస్ఏంజిల్స్ ప్రవాసుల ఘననివాళి

NTR శతజయంతి ఉత్సవాలు అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో ఘనంగా నిర్వహించారు. 1500 మంది ప్రవాసులు పాల్గొని విజయవంతం చేశారు. రాజు వత్సవాయి ప్రార్థనాశ్లోకంతో ప్రారంభమైన వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్సవాలకు సినిమా రంగం నుంచి ప్రముఖ దర్శకులు వైవిఎస్ చౌదరి, నటులు నాగినీడు, రాజకీయ రంగం నుంచి టి డి జనార్ధన్, పరిటాల శ్రీరాం, పులివర్తి నాని, గాలి భానుప్రకాష్, IPS అధికారి ఏబి వెంకటేశ్వరరావులు హాజరయ్యారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన క్రికెట్, వాలీబాల్, టెన్నికాయిట్ విజేతలకు ఎన్టీఆర్ ట్రోఫీలను బహుకరించారు. కార్యక్రమ నిర్వాహకులు ప్రసాద్ పాపుదేశి , చందు నంగినేని, రాహుల్ వాసిరెడ్డి, వెంకట్ ఆళ్ల వేడుకల విజయవంతానికి సహకరించిన తెలుగు సంఘాలకు, మార్గనిర్దేశకత్వం చేసిన శరత్ కామినేనికి కృతజ్ఞతలు తెలిపారు.


ప్రవాసాంధ్రుడు ప్రసాద్ పాపుదేశి మాట్లాడుతూ ఎన్టీఆర్ నుండి ఈ తరం యువత క్రమశిక్షణ, నిజాయితీ, పట్టుదల, కష్టపడే తత్వం నేర్చుకోవాలని కోరారు. కార్యక్రమ నిర్వహణకు తోడ్పడిన విష్ణు అటుకారి, సురేష్ కందేపు, సురేష్ మల్లిన, రామ్ యలమంచిలి, సుధా దావులూరి, శిరీష గాజుల, రామ్ కొడితల, సూర్య భమిడిపాటి, కృష్ణ భూమా, సబితా గుండపనేని, మధు బోడపాటి, శివ గుంటూరు, వంశి గరికపాటి, రవి బొజ్జ, విష్ణు కేటరింగ్, డా. శ్యాం కూనం, డా. రవి ఆలపాటి, డా. కృష్ణప్రసాద్ సూరపనేని, కిషోర్ కంఠమనేని, సతీష్ గుండపనేని తదితరులకు నిర్వాహకులు ప్రేత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పరిటాల శ్రీరామ్, గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ తమ కుటుంబాలకు ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని, చిన్నతనంలో వారు ఎన్టీఆర్ తో కలిసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. పులివర్తి నాని మాట్లాడుతూ ఎన్టీఆర్ హయాంలోనే చిత్తూరు జిల్లా తిరుపతిలో మహిళా యూనివర్సిటీ, పద్మావతి మహిళా కళాశాల వంటి విద్యాసంస్థలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. టి. డి. జనార్దన్ ఎన్టీఆర్ ఏ రకంగా ప్రజలను చైతన్యవంతులను చేసింది, ముఖ్యంగా రైతులకు సహకార సంస్థలను నెలకొల్పి వాటి ద్వారా సామాన్య ప్రజలకు రద్దు చేసినట్లు తెలిపారు. అలానే వాళ్ళు తలపెట్టిన ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహానికి జరుగుతున్న సన్నాహ కార్యక్రమాలను వివరించి ఎన్నారైలను తమ వంతు తోడ్పాటు చేయవలసిందిగా కోరారు. వైవిఎస్ చౌదరి తన ఉపన్యాసంతో ఆకట్టుకున్నారు.


శిరీష గాజుల, నీలిమ గడిచర్లల శిష్యబృందం చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. శరవణ పడాల దానవీరశూరకర్ణ డైలాగులతో అలరించాడు. ఫీనిక్స్ కు చెందిన ప్రవాసాంధ్రుడు వెంకట్ కొమ్మినేని మయసభ ఏకపాత్రాభినయంతో ఆకట్టుకున్నారు. కవి వేణుగోపాల్ అక్కినేపల్లి ఎన్టీఆర్ మీద రచించిన ఆటవెలది పద్యాలను చదివి అలరించారు. రాజ్ మంచిరాజు రచించిన జోహార్ ఎన్టీఆర్ కవిత దృశ్య రూపంలో ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాలకు సుధా దావులూరి సంధానకర్తగా వ్యవహరించగా, రామ్ కొడితల , సిద్దు యాదల్ల ఆడియో వీడియో సహకారం అందించారు. టాలీవుడ్ సింగర్ సింహ బృందంచే నిర్వహించబడిన ఎన్టీఆర్ సంగీత విభావరితో ఈ కార్యక్రమాన్ని ముగించారు.