భారీ వర్షాలతో గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం గండి పోచమ్మ ఆలయం వద్ద నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అమ్మవారి ఆలయ గోపురం వరకు వరదనీరు చేరింది. వరద ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉద్ధృతి నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను పర్యాటకశాఖ అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.మరోవైపు పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం 31 మీటర్లకు చేరింది. వరద మరింత పెరిగే అవకాశముందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. గోదావరి నుంచి గత 48 గంటలల్లో 3.25 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.