విశ్వగురువుగా కీర్తించపడుతున్న ప్రధాని నరేంద్రమోదీ గౌరవం ఏటా పెరుగుతోంది. ప్రపంచంలోని అగ్రదేశాలు సైతం మోదీకి రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తున్నాయి. ఒకప్పుడు మోదీ పర్యటనై నిషేధం విధించిన అగ్రరాజ్యం అమెరికా సైతం ఇప్పుడు మోదీ రాక కోసం ఎదురు చూస్తోంది. ఇటీవల ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన మోదీకి అరుదైన గౌరవం లభించింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రధాని మోదీకి ఏటా ఫాలోవర్లు పెరుగుతున్నారు. మోదీ ట్విట్టర్ ఫాలోవర్స్ ఇప్పటికే 90 మిలియన్లు దాటింది. దీంతో ట్విటర్ ఖాతాలో అత్యధికా ఫాలోవర్స్ ఉన్న టాప్ 10 జాబితాలో మోదీ నిలిచారు. అగ్రరాజ్యం అమెరికా, సంపన్న దేశం బ్రిటన్ ప్రధానికి కూడా మోదీకన్నా తక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు 37.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కి కేవలం రెండు మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
అత్యధిక మంది ఫాలోవర్స్ ఉన్నది వీరికే..ప్రపంచ చాలా మంది ట్విట్టర్ ఉపయోగిస్తున్నారు. దేశాధినేతలు సైతం ట్విట్టర్‌లో యాక్వివ్‌గా ఉంటున్నారు. ఇటీవల ట్విటర్ గ్రాఫ్ పడిపోతోంది. థ్రెడ్స్ వచ్చిన తర్వాత ట్విట్టర్ గట్టిపోటీ ఎదురవుతోంది. అయినా పలు దేశాల ప్రధానులు, అధ్యక్షులు ఇంకా ట్విట్టర్ వేదికగానే తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్నవారిలో ట్విటర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో నిలిచారు. ఈయనకు 148.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 132 మిలియన్ల ఫాలోవర్లతో రెండోస్థానంలో ఉన్నారు. కెనడియన్ సింగర్ జస్టిన్ బీబర్ 112 మిలియన్ ఫాలోవర్లతో మూడో స్థానంలో ఉన్నారు. పోర్చుగీస్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు 108.9 మిలియన్ల ఫాలోవర్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం 108.2 మిలియన్ల మంది అనుచరులతో బార్బాడియన్ గాయని రిహన్నా ఐదవ స్థానంలో ఉన్నారు. అమోరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మైక్రోబ్లాగింగ్ సైట్‌లో 86.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
2009 నుంచి మోదీ ట్విట్టర్..నరేంద్రమోదీ 2009లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు సోషల్ మీడియా సైట్‌లో చేరారు, అప్పటి నుంచి ప్లాట్‌ఫారంలో అతని ఫాలోయింగ్ పెరిగింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో 90 మిలియన్లకుపైగా ఫాలోవర్లతో ట్విట్టర్‌లో అత్యధికంగా అనుసరించే రాజకీయ నాయకులలో ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు. ట్విట్టర్‌లో అత్యధిక మంది ఫాలోవర్స్ జాబితాలో టాప్ 10లో ఉన్న ఏకైక భారతీయుడు మోదీ నిలిచారు. ప్రస్తుతం ప్రపంచ జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నారు.