పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షను సవాలు చేస్తూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మోదీ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసులో ట్రయల్ కోర్టు విధించిన శిక్షను తొలుత జిల్లా సెషన్స్ కోర్టులో రాహుల్ సవాలు చేశారు. అక్కడ ఆయన పిటిషన్‌ను కొట్టేయడంతో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా వ్యతిరేక తీర్పు వచ్చింది.