🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 21.07.2023 ✍🏻
🗓 నేటి రాశి ఫలాలు 🗓
🐐 మేషం
ఈరోజు (21-07-2023)
ఈ రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచి పోతుంది. ఒకటి రెండు శుభవార్త వినటం కార ణంగా హ్యాపీ మూడ్ లో ఉంటారు. ఉద్యోగంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ప్రమోషన్ రావటం లేదా ఆదాయం పెరగటం వంటివి ఏదైనా జరగవచ్చు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 వృషభం
ఈరోజు (21-07-2023)
అనుకున్న పనులు అనుకున్నట్టు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఉద్యోగానికి సంబంధించి శుభ వార్త వింటారు. జీవిత భాగస్వామికి కూడా ఉద్యో గంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపా రాలు సంపాదనపరంగా పురోగతి సాధిస్తాయి. సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు వెంటనే అమలు చేయడం మంచిది. ఆరోగ్య పరిస్థితి, ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉంటాయి.
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 మిధునం
ఈరోజు (21-07-2023)
వృత్తి, ఉద్యోగాలలో ప్రమోషన్ లేదా మంచి ఇంక్రి మెంట్ పొందటానికి అవకాశం ఉంది. అధికా రులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగు తుంది. నిరుద్యోగులు, అవివాహితులు శుభవార్త వినే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. బంధువుల రాకపోకలు ఉంటాయి. చిన్ననాటి స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంలో అన్యోన్యత సామరస్యం వృద్ధి చెందుతాయి.
💑💑💑💑💑💑💑
🦀 కర్కాటకం
ఈరోజు (21-07-2023)
అనుకోకుండా ఉద్యోగంలో బాధ్యతలు పెరగడం జరుగుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందిస్తుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. కొన్ని వ్యక్తిగత వ్యవహారాలు కొద్దిపాటి ప్రయత్నంతో పూర్తి అవుతాయి. ఓర్పు సహనాలతో వ్యవహరిస్తే అంతా మంచే జరుగుతుంది.
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 సింహం
ఈరోజు (21-07-2023)
ఉద్యోగపరంగా దూరప్రాంతాల నుంచి ఒక శుభ వార్త వింటారు. ఉద్యోగంలో మార్పులకు సంబం ధించి అధికారుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. కుటుంబంలో ఒకటి రెండు విభేదాలు సామరస్యంగా పరి ష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపా రాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి.
🦁🦁🦁🦁🦁🦁
💃 కన్య
ఈరోజు (21-07-2023)
ఒకటి రెండు వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాం తంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. అయితే, ఇతరులకు వాగ్దానాలు చేయడానికి, హామీలు ఉండటానికి ఇది సమయం కాదు. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అనుకోకుండా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
💃💃💃💃💃💃💃
⚖ తుల
ఈరోజు (21-07-2023)
సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలన్నిటిని సకాలంలో పూర్తి చేస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారాలలో లాభాలకు లోటు ఉండదు. నిరుద్యోగులు, అవివాహితులు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కొందరు సన్నిహితులకు సహాయం చేయడం జరుగుతుంది.
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 వృశ్చికం
ఈరోజు (21-07-2023)
అటు ఉద్యోగంలోనూ, ఇటు కుటుంబంలోనూ బరువు బాధ్యతలు పెరుగుతాయి. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారాలు సామా న్యంగా సాగిపోతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నా లను వాయిదా వేయటం మంచిది. సోదర వర్గంతో ఆస్తి సంబంధమైన వివాదాలు తలెత్తే సూచనలున్నాయి. ఆరోగ్యం పరవాలేదు.
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 ధనుస్సు
ఈరోజు (21-07-2023)
ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినప్పటికీ అది సఫలం అవుతుంది. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. వాటిని వెంటనే అమలు చేయడం మంచిది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో విశ్వసనీయత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన సత్ఫలితాలను ఇస్తాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు త్వరగా పూర్తవుతాయి.
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 మకరం
ఈరోజు (21-07-2023)
రోజంతా సంతృప్తికరంగా సాగిపోతుంది. తల పెట్టిన పనులు మిత్రుల తోడ్పాటుతో పూర్తి అవు తాయి. పెళ్లికి సంబంధించి బంధువుల నుంచి శుభవార్త వింటారు. కుటుంబ వ్యవహారాలు చాలా వరకు చక్కబడతాయి. ముఖ్యమైన వ్యక్తి గత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. వృత్తి ఉద్యోగాలలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఆదాయం, ఆరోగ్య పరిస్థితి చాలా వరకు మెరుగుపడతాయి.
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 కుంభం
ఈరోజు (21-07-2023)
ఆటంకాలు, అవరోధాలు ఉన్నప్పటికీ పట్టుదలగా ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో కూడా పని భారం ఉన్నప్పటికీ సకా లంలో బాధ్యతలు నిర్వహిస్తారు. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు. విదేశాలలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది.
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 మీనం
ఈరోజు (21-07-2023)
శుభ కార్యాలు, పుణ్య కార్యాల మీద బాగా ఖర్చు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు వచ్చి చేరుతాయి. వ్యాపారంలో లాభాలు పెరుగు తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగ స్వామి నుంచి శుభవార్త వినడం జరుగుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. పరిచయస్తులలో వివాహ సంబంధం కుదురుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించడం మంచిది.
🦈🦈🦈🦈🦈🦈🦈