టెక్సాస్‌లోని హ్యూస్టన్‌కు చెందిన ఓ మహిళను దుబాయ్‌లో “బహిరంగంగా అరిచింది” అనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. టియెర్రా యంగ్ అలెన్ అనే ఆ మహిళ కుటుంబం ఆమె రెండు నెలలుగా దుబాయ్ లో చిక్కుకుపోయిందని, ఆమె భవిష్యత్తు గురించి తమకు భయంగా ఉందని ఫాక్స్ 26కి మీడియాకు తెలిపారు. తన కుమార్తె పాస్‌పోర్ట్ జప్తు చేశారని అలెన్ తల్లి పేర్కొంది.
హ్యూస్టన్‌లో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, ఈ కేసు తేలేవరకు ప్రయాణ నిషేధం కింద ఉంచబడ్డారని అవుట్‌లెట్ తన నివేదికలో పేర్కొంది. అలెన్ తల్లి టీనా బాక్స్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. మే నెలలో తన కుమార్తె యూఏఈలో తన స్నేహితుడితో కలిసి సెలవులకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది.
స్నేహితులు ప్రమాదానికి గురయ్యారు. వారు నడుపుతున్న అద్దె కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. “మైనర్ ఫెండర్ బెండర్”లో ఎవరూ గాయపడలేదు, అయితే కారు నడుపుతున్నారనే కారణంతో ఆమె స్నేహితురాలిని దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక వారం తర్వాత కస్టడీ నుండి విడుదల చేశారు.
ఆ తరువాత, అలెన్ తన క్రెడిట్ కార్డ్‌లు,ఐడీకార్డులు, స్వాధీనం చేసుకున్న ఇతర వ్యక్తిగత వస్తువులను తీసుకోవడానికి కారు అద్దె కంపెనీకి వెళ్లినప్పుడు ఆసలు విషయం మొదలయ్యింది. అక్కడ వారు ఆమె వస్తువులు తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు. బదులుగా ఎక్కువ మొత్తం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడ తమపై అరుస్తున్న ఒక యువకుడితో ఆమె కూడా అరుస్తూ మట్లాడింది.. ఫలితంగా దుబాయ్‌లో అరిచినందుకు ఆమెపై అభియోగాలు మోపారు. దీనిమీద తల్లి మాట్లాడుతూ.. “ఆమె ఒక ఒకే కారణంతో జైలులో ఉంది, ఆమె తన గొంతు పెంచింది. ఆ దేశంలో, ఒక ఆడది తన గొంతు ఎత్తడానికి కూడా హక్కు లేదు. మహిళ గొంతు పెంచితే జైలు శిక్ష విధించబడుతుంది” అని కమ్యూనిటీ కార్యకర్త ఒకరు అన్నారు.
“ఇది జైలు శిక్షకు దారితీయవచ్చు. చాలా భయానకంగా ఉంది” అని అలెన్ తల్లి అన్నారు. యూఏఈలో పబ్లిక్ లో ప్రవర్తించడానికి సంబంధించిన చట్టాలు యూఎస్ లోని చట్టాలకు చాలా భిన్నంగా ఉంటాయి. ప్రధానంగా ముస్లిం దేశాన్ని సందర్శించాలని భావించే అమెరికన్లను డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ముందుగానే హెచ్చరిస్తుంది. అక్కడి కఠిన చట్టాల గురించి అవగాహన చేసుకున్నాకే వెళ్లాలని చెబుతుంది.