ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ఖచ్చితమైన ప్రకటన చేసింది. హైకోర్టును అమరావతి నుంచి తరలించే ప్రతిపాదన తమ వద్ద పెండింగ్‌లో లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. హైకోర్టు తరలింపు అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఉమ్మడి నిర్ణయానికి రావాలని కేంద్ర న్యాయశాఖ ఈ సందర్భంగా సూచించింది. వైసీపీ ఎంపీ తలారి రంగయ్య లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖమంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. హైకోర్టు తరలింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి పూర్తిస్థాయి ప్రతిపాదన పంపితే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని స్పష్టం చేసింది.