గోల్ గప్పా….పానీ పూరి..వరల్డ్ ఫేమస్ స్నాక్ . బయట దేశాలకు తెలీకపోయినా మనోళ్లు పరిచయం చేస్తారు. ప్రతి ఫ్రెండ్ మరో ఫ్రెండ్ కు సజిస్ట్ చేసే టైం పాస్ స్నాక్ ఈ పానీపూరీ. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ పానీపూరీలను తినేందుకు ఇష్టపడుతుంటారు. రోడ్ల పక్కన ఉండే పానీపూరీ షాప్‌ల వద్ద నిలబడి తినేస్తుంటారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరూ ఇష్టంగా తినే స్నాక్ పానీపూరీ . చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ పానీపూరీలను తినేందుకు ఇష్టపడుతుంటారు. రోడ్ల పక్కన ఉండే పానీపూరీ షాప్‌ల వద్ద నిలబడి తినేస్తుంటారు. పానీపూరీలను విక్రయించే వారు శుభ్రత పాటించడం లేదని ఎన్ని వార్తలు వచ్చినా వాటి క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా పానీపూరీకి సంబంధించి మరో షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో చూశాక పానీపూరీ తినాలంటే కాస్తయినా భయం వేస్తుంది.
cobraexperiments అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఓ వ్యక్తి మార్కెట్ నుంచి తెచ్చిన పానీపూరీ నీళ్లను డ్రాపర్ సాయంతో తీసుకుని మైక్రోస్కోప్ ద్వారా టెస్ట్ చేశాడు. దానిని జూమ్ చేసి చూస్తే ఆ పానీలో మొదట చిన్న చిన్న కూయగూరల సెల్స్ కనిపించాయి. ఆ తర్వాత మసాలాలు, కొత్తిమీర ఆకులు కనిపించాయి. ఆ తర్వాత చిన్న చిన్న పురుగులు కూడా కనిపించాయి. ఆ వీడియోను ఆ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పురుగులు అంటే..నీళ్లు..లేదా …వాటర్ లో కలిపే పేస్ట్ ను నాలుగు లేదా ఐదు రోజులకు ఓ సారి చేస్తారు. కాబట్టి ఈ పురుగులు ఉండి ఉండవచ్చని అంటున్నారు నెటిజన్లు.ఇప్పటివరకు ఈ వీడియో ను 4 లక్షల మందికి పైగా లైక్ చేశారు. 10 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. ఓ మైగాడ్.. పానీపూరీ చాలా ప్రమాదకరం, ఈ వీడియో చూసిన వారందరూ ఆ తర్వాత పానీపూరీ తింటారు, పానీపూరీలకు దూరంగా ఉండడం కష్టం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొని కొంతమంది పానీ పూరీ లవర్స్ మాత్రం ఈ చేదు నిజాన్ని అసలు ఒప్పుకోవడం లేదు. ఈ మధ్య కాలంలో చాలా వరకు నీట్ గానే ఉంటున్నారని …మరీ అంత దారుణంగా ఏం లేవని కామెంట్లు పెడుతున్నారు. వీడియో వైరల్ కావడానికి ఏదో ట్రిక్ ప్లే చేస్తున్నారని కామెంట్లు