Politics

బాలకృష్ణ పై జగన్ ఫైర్

బాలకృష్ణ పై  జగన్ ఫైర్

సీఎం జగన్ తన స్టైల్ మార్చినట్లు కనపడుతుంది. ఇన్ని రోజులు ఏ మీటింగ్ లో మాట్లాడిన చంద్రబాబు నాయుడు, పేరెత్తకుండా పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా పై విరుచుకుపడే ఆయన ఇవాళ కొత్త‌గా బాలకృష్ణ, నారా లోకేష్‌ల‌పై హాట్ కామెంట్స్ చేశారు. దీనంతటికీ ప్రధాన కారణం వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలే అని స్పష్టంగా కనబడుతోంది.

ఇవాళ వైఎస్సార్ నేతన్న నేస్తం ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం జగన్ వెంకటగిరి బహిరంగ సభలో మాట్లాడుతూ.. సంస్కారం ఉన్న ఏ ఒక్కరూ వలంటీర్లను అవమానించరని.. పట్టపగలే మందు తాగుతూ పది మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కనే డ్యాన్సులు చేసేవాడు ఒకడు, అమ్మాయి కనిపిస్తే ముద్దన్నా పెట్టాలి, కడుపన్నా చేయాలని ఇంకొక దౌర్భాగ్యుడంటాడు. నువ్వు సినిమాల్లోనే చేశావు, నేను నిజజీవితంలో చేశాను అంటూ వెధవ పనులను ఇంకొక ముసలాయన చెప్పుకుంటాడ‌ని.. అలాంటి సంస్కార హీనులు వ‌లంటీర్ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం సిగ్గుచేటు అన్నారు.అలాగే ప‌వ‌న్ పేర‌త్త‌కుండా.. వాలంటీర్ల క్యారెక్టర్ ను తప్పుబట్టింది పదేళ్లుగా చంద్రబాబుకు వాలంటీర్ గా పనిచేస్తున్న ప్యాకేజీ స్టార్ అని అమ్మాయిలను లోబర్చుకొని, వారిని పెళ్లి చేసుకోవడం, నాలుగేళ్లు కాపురం చేసి వదిలేయడం. పైగా ఒకరితో వివాహంబంధంలో ఉంటూ ఇంకొకరితో అక్రమ సంబంధం. ఈయన మన వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడతారు అంటూ ప‌వ‌న్‌పై ఫైర్ అయ్యారు.

కాకా ఇన్ని రోజులు బాలకృష్ణ, నారా లోకేష్ లపై ఏ విమర్శలు చేయని జగన్ ఇవాళ వారిపై కూడా విమర్శలు చేశారు. నారా లోకేష్ అయితే రోజు సీఎం జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడుతూనే ఉన్నారు. కాకపోతే ఆరు నెలల్లో ఒక వారం రోజుల‌ పాటు మాత్ర‌మే రాజకీయాలు గురించి పట్టించుకునే బాలకృష్ణపై సీఎం జగన్ విమర్శలు చేయడం విశేషం.