WorldWonders

పాములను కట్నంగా ఇస్తేనే పెళ్లి

పాములను కట్నంగా ఇస్తేనే పెళ్లి

వివాహ చేసుకుంటే చాలామంది పెళ్లి కొడుకు తరపున వారు కట్నంగా డబ్బులు, బంగారం, వెండి లాంటి వస్తువులు తీసుకుంటారు. మరికొందరైతే పోలాలు కూడా ఇస్తుంటారు. కానీ ఛత్తీస్‌ఘడ్‌లో మాత్రం ఓ గిరిజన తెగ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కొర్బా ప్రాంతానికి చెందిన సన్వారా అనే గిరిజన తెగ.. తమ బిడ్డలకు వివాహం చేస్తే కట్నంగా పాములు ఇస్తారు. ఈ ఆచారాన్ని వాళ్లు వందల ఏళ్లుగా పాటిస్తున్నారు. పెళ్లి జరిగేటప్పుడు ఈ సన్వారా తెగ వారు వరుడికి పాములను కట్నంగా ఇస్తారు. అంతేకాదు మొత్తం 9 రకాల జాతుల చెందిన 21 పాములను అల్లుడికి కానుకగా అందజేస్తారు.మరో విషయం ఏంటంటే ఈ సన్వారా తెగలో ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు కట్నంగా పాములు ఇవ్వకపోతే.. ఆ ఆడపిల్లను ఎవరూ చేసుకోరు. తమ పూర్వీకులు 60 పాములు ఇచ్చేవారని.. కాలానుక్రమంగా వాటి సంఖ్య తగ్గిపోయిందని సన్వారా తెగకు చెందిన ఓ గిరిజనుడు చెప్పాడు. వాస్తవానికి పాములు ఆడించడమే వారి జీవనాధరం.. అక్కడి వారి సంప్రదాయాలను గౌరవించి ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం కూడా ఈ కట్నం విధానానికి అనుమతులు ఇస్తోంది.