సరిగ్గా ఇరవై రోజుల్లో ఈ పాటికి భోళా శంకర్‌తో థియేటర్‌లు దద్దరిల్లుతుంటాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ అభిమానులకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. వింటేజ్ బాస్‌ను చూడబోతున్నామనే ఫీల్‌తో ఉన్నారు. ఓ వైపు మెహర్ రమేష్ టేకింగ్‌పై బోలెడు అనుమానాలున్నా.. చిరుతో సినిమా, పైగా ఆయన అభిమాని కాబట్టి సినిమా అందరినీ సాటిస్‌ఫై చేసే రేంజ్‌లోనే ఉంటుందని ధీమాగా ఉన్నారు. ఆగస్టు 11న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకుంటుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్‌లను ప్రకటిస్తూ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు.తాజాగా ఈ సినిమాలోని మిల్కీ బ్యూటీ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. విజయ్ ప్రకాష్, సంజన కల్‌మన్జీ వోకల్స్ అదిరిపోయాయి. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం ట్రెండ్‌కు తగ్గట్లు చాలా క్యాచీగా ఉంది. మహతీ స్వరసాగర్ అద్భుతంగా ట్యూన్ కంపోజ్ చేశాడు. ఇక చిరు క్లాస్సీ స్టెప్స్ అయితే వీర లెవల్లో ఉన్నాయి. తమన్నా సైతం గ్లామర్‌తో కట్టేపడేసింది. ఇప్పటికే రిలీజైన భోళా మేనియా, సెలబ్రేషన్ సాంగ్స్ ఇన్‌స్టాంట్‌గా ఎక్కేశాయి. ఈ పాట కూడా వాటిల్లాగే సోషల్ మీడియాను ఊపేస్తుందనడంలో సందేహమే లేదు.
మిల్కీ బ్యూటీ లిరికల్ సాంగ్ విడుదల
Related tags :