అమెరికాకు కుటుంబంతో గడిపేందుకు పర్యాటకులుగా వచ్చే ప్రవాస తల్లిదండ్రులు ఇంట్లోనే మగ్గిపోకుండా ఉండేందుకు స్థానిక ప్రవాసులు చొరవ తీసుకుంటున్నారు. తాజాగా వర్జీనియాలో ప్రవాసులు అధికంగా ఉండే హెర్న్‌డన్, యాష్‌బర్న్, స్టెర్లింగ్, రెస్టన్ వంటి ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రవాస తల్లిదండ్రులకు “సరదా శుక్రవారం” పేరిట వ్యాపకాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి శుక్రవారం హెర్న్‌డన్ పార్కులో వీరంతా కలిసి అల్పాహారం, తేనీరు సేవిస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వర్తమాన వ్యవహారాలపై పిచ్చాపాటి చర్చించుకుంటున్నారు. తమ ప్రాంతానికి చెందిన ఇతర కుటుంబాల వారిని ఈ కార్యక్రమంలో కలుసుకుని పరిచయాలు పెంచుకుంటున్నారు. ఇంట్లోనే కూర్చుని విసుగు చెందకుండా ప్రకృతిలో సరదాగా కాలక్షేపం ఏర్పాటు చేసిన నిర్వాహకులను వీరు అభినందిస్తున్నారు. భాను మాగులూరి, ఉప్పుటూరి రామ్ చౌదరి వంటివారు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరుస్తున్నారు.
వర్జీనియాలో ప్రవాస తల్లిదండ్రులతో “సరదా శుక్రవారం”
Related tags :