Business

తగ్గిన విద్యుత్ వినియోగం

తగ్గిన విద్యుత్ వినియోగం

రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలతో రోజువారీ విద్యుత్‌ వినియోగం గణనీయంగా తగ్గింది. 5 రోజుల వ్యవధిలోనే 8.4 కోట్ల యూనిట్ల మేర వినియోగం తగ్గడంతో విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లపై భారీగా ఆర్థిక భారం తప్పింది. కరెంటు రోజూవారీ వినియోగం ఈ నెల 15న 25.6 కోట్ల యూనిట్లు ఉండగా.. 20న అది 17.2 కోట్ల యూనిట్లకు చేరింది. ఈనెల 15 వరకు రోజుకు 7-8 కోట్ల యూనిట్ల కరెంటును అధిక ధరలకు ‘భారత ఇంధన ఎక్స్ఛేంజీ’లో డిస్కంలు కొనుగోలు చేశాయి. ఈమేరకు గత నెలలో రూ.372 కోట్లు, ఈ నెల 15 దాకా రూ.200 కోట్ల మేర కరెంటు అదనపు కొనుగోలుకు వెచ్చించాయి. భారీవర్షాలు ప్రారంభమై.. వినియోగం తగ్గడంతో ఈ అదనపు కొనుగోలును ప్రస్తుతం పూర్తిగా తగ్గించాయి. ఈనెల 15న అత్యధికంగా 12,489 మెగావాట్ల డిమాండ్‌ నమోదు కాగా.. శుక్రవారం అది కేవలం 8 వేల మెగావాట్లు ఉంది.