Politics

వాలంటీర్ల బాస్ ఎవరు: పవన్ కళ్యాణ్

వాలంటీర్ల బాస్ ఎవరు: పవన్ కళ్యాణ్

వాలంటీర్ల బాస్ ఎవరు..? అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన పోస్ట్‌ పెట్టారు. డేటా చోరిపై మరోసారి పవన్ కళ్యాణ్‌ ట్వీట్ చేశారు. ప్రజల డేటా సేకరణపై వైసీపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు పవన్ కళ్యాణ్.వాలంటీర్ల బాస్ ఎవరు..? ప్రైవేట్ కంపెనీకి డేటా ఇవ్వడాన్ని ఎవరు అనుమతించారు..? అని నిప్పులు చెరిగారు. వ్యక్తిగత సమాచారం సేకరించమని ఎవరు సూచిస్తున్నారు..? ప్రైవేట్ కంపెనీకి డేటా వెళ్తోంటే.. ఆ కంపెనీ ఎవరిది..? అంటూ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. డేటా సేకరించమని ఆదేశించింది ముఖ్యమంత్రా..? చీఫ్ సెక్రటరీనా..? కలెక్టర్లా..? ఎమ్మెల్యేలా..? అంటూ సోషల్‌ మీడియాలో ఆగ్రహించారు పవన్ కళ్యాణ్.