జర్మనీలోని గ్రామిట్జ్‌లో ఓ హోటల్‌లో అతిథుల కోసం ఆహారం సిద్ధం చేస్తున్న రోబో ఇది. ట్యాబ్‌లో కావాల్సిన ఆహారాన్ని ఎంపిక చేసుకుంటే రోబోనే సిద్ధం చేస్తుంది. ఆర్టిఫీషియల్ టెక్నాలజీతో మనిషి అవసరం క్రమేపీ తగ్గిపోతోంది. జర్మనీలో అందుబాటులోకి వచ్చిన ఓ టెక్నాలజీ వంట గదిలోనూ మనిషి అవసరం లేకుండా చేస్తోంది. జర్మనీలోని గ్రామిట్జ్ ఓ హోటల్ యాజమాన్యం అతిథుల కోసం ఆహారం సిద్ధం చేసేందుకు రోబోను ఏర్పాటు చేసింది. మనకు కావాల్సిన ఆహారాన్ని ట్యాబ్లో ఎంపిక చేసుకుంటే రోబోనే ఆ వంటను గుమగుమలాడిస్తుంది. ప్రస్తుతానికి ఆ రోబో 5 రకాల ఆహార పదార్థాలను సిద్ధం చేస్తోందట.