WorldWonders

ఆకాశం నుంచి జారిన నల్లరాయి

ఆకాశం నుంచి జారిన నల్లరాయి

ఫ్రాన్స్‌లో స్నేహితురాలి కలిసి కాఫీ తాగుతున్న ఓ మహిళకు ఊహించని ఘటన కళ్లముందు కనిపించింది.  గాలిలో పెద్దగా పేలుడు శబ్దం వినిపించడంతో వారిద్దరు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. తేరుకొని చూస్తే.. ఆ మహిళ పక్కటెముకల్లో ఏదో తగిలినట్లు నొప్పి మొదలైంది. దీంతో జరిగిందని చూడగా.. ఓ విచిత్రమైన గట్టిగా నిగనిగలాడే నల్ల రాయి ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించింది.

న్యూస్‌వీక్ నివేదిక ప్రకారం.. జూలై 6న  తన ఇంటిలో టెర్రస్‌పై స్నేహితురాలితో కలిసి ఉండగా.. ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన తర్వాత  ఆ మహిళ పక్కటెముకల్లో నొప్పి రావడంతో ఆందోళనకు గురైంది. మొదట ఏదో గబ్బిలం లాంటిది అనుకుని చుట్టు పక్కల వెతికారు.  ఏమీ కనిపించడంతో కనిపించకపోవడంతో ఆందోళన మరింత ఎక్కువైంది. అయితే పరిసర ప్రాంతాల్లో ఓ విచిత్రమైన నల్ల రాయి వారి దృష్టిని ఆకర్షించింది.  ఆ రాయిని పరిశీలించిన మహిళలు మొదట సాధారణ సిమెంట్ లేదా శిథిలాల ముక్క అని భావించారు. తర్వాత ఇదేదో ఉల్కను పోలి ఉండే గట్టి నిగనిగలాడే రాయి అని గమనించారు. నిజంగా ఉల్క అనే ఊహగానాలు పెరగడంతో నిర్దారించుకునేందుకు జియాలజీ శాస్త్రవేత్తను సంప్రదించింది. థియరీ రెబ్మాన్ అనే జియాలజీ శాస్త్రవేత.. నల్ల రాయిని క్షుణ్ణంగా పరిశీలించి.. అది సాధారణ నల్ల రాయి కాదని, అది నిజంగానే ఉల్క అని నిర్దారించారు. విశేషమేమిటంటే ఈ ప్రత్యేక ఉల్క అంతరిక్షం నుండి నేరుగా భూమిని ఢీకొన్నందున ప్రత్యేకమైనదని ఆయన పేర్కొన్నారు. అయితే జరిగిన పరిణామాలన్నింటి గుర్తు చేసుకొని ఆ మహిళ వణికిపోయింది. ఒకవేళ ఆ ఉల్కనే నేరుగా శరీరంలో మరేదైన భాగానికి తగిలివుంటే తన పరిస్థితి ఏంటని  ఆందోళన చెందినా..  పెద్ద ప్రమాదం నుంచి బయటపడినందుకు అదృష్టవంతురాలినని సంతోషపడింది.

భూమితీ అంతరిక్ష శిలలు కాస్మోస్ తరుచుగా ఢీకొనడం అనేది సంభవిస్తుంటుంది. ప్రతి రోజు 50 టన్నుల ఉల్కలు భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. ఇందులో కొన్ని మాత్రమే మనకు కనపడతాయి. ఫ్రాన్స్ లో జరిగి ఈ సంఘటన ఇలాంటిదే.. ఇటువంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఆకాశం నుంచి పడిన నల్ల రాయికి అద్భుత శక్తులు ఉంటాయని.. ఆ రాయికి మహిమలు ఉంటాయంటూ కొందరు ఇదే సమయంలో ప్రచారం చేయటం విశేషం. అయితే అలాంటిది ఏమీ లేదని.. ఇది కేవలం ఓ రాయి మాత్రమే అంటున్నారు శాస్త్రవేత్తలు. శక్తులు అంటూ ఏమీ లేదని.. ఉండవని స్పష్టం చేస్తూ.. ఇలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని కోరుతున్నారు.