* పెళ్లికి నిరాకరించిందని యువతి కిడ్నాప్
ప్రకాశం జిల్లా కురిచేడులో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పెళ్లి నిరాకరించిందనే కోపంతో యువతిని కిడ్నాప్ చేసి.. చిత్రహింసలకు గురిచేశాడు. మద్యం సీసాతో విచక్షణరహితంగా దాడి చేసి.. ముఖంపై కూడా గాయపరిచాడు. దీంతో యువతిని ఆస్పత్రికి తరలించిన చికిత్స అందించారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. బాధిత యువతికి తన గ్రామానికే చెందిన వీరనారాయణా చారితో పరిచయం ఉంది. ఆమె ప్రస్తుతం స్నేహితురాలితో కలిసి కురిచేడులో నివాసం ఉంటుంది. అయితే కొంతకాలంగా వీరనారాయణ చారి.. బాధిత యువతిని వేధింపులకు గురిచేస్తున్నాడు. ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వెంటపడుతూనే ఉన్నాడు. ఈ విషయాన్ని యువతి తన కుటుంబ సభ్యులు చెప్పడంతో.. వారు వీరనారాయణ చారిని అమ్మాయి జోలికి రావొద్దని హెచ్చరించారు. దీంతో కక్ష పెంచుకున్న వీరనారాయణ చారి ఆమెను కిడ్నాప్ చేశాడు. ఓ చోట బంధించి తనను పెళ్లి చేసుకోవాలని ఓత్తిడి తెచ్చాడు. అయితే అందుకు యువతి అంగీకరించకపోవడంతో ఆమెపై దాడి చేశారు. ఖాళీ మద్యం బాటిల్‌ను పగలగొట్టి యువతి శరీరంపై గాయాలు చేశాడు. గొంతు, ముఖం, చేతుల మీద గాయపరిచాడు. అనంతరం ఆమెను కురిచేడులో వదిలిపెట్టి పారిపోయాడు. అయితే బాధిత యువతి ఈ విషయం కుటుంబ సభ్యులు ఫోన్ ద్వారా సమాచారమిచ్చింది. దీంతో వారు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
* చెరువులో పడిన బస్సు, 17 మంది దుర్మరణం
బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఝలకతి సదర్ ఉపజిల్లాలోని ఛత్రకాండ ప్రాంతంలో శనివారం బస్సు రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా.. 35 మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో ఏడుగురు మైనర్లు, ఐదుగురు మహిళలు ఉన్నారు.భండారియా ఉపజిల్లా నుంచి ఫిరోజ్‌పూర్‌కు వెళ్తున్న బస్సు స్థానిక యూనియన్ పరిషత్ కార్యాలయం సమీపంలో ఉదయం 9.55 గంటలకు ఆటో రిక్షాకు సైడ్ ఇస్తుండగా.. డ్రైవర్ చక్రాల నియంత్రణ కోల్పోవడంతో చెరువులో పడిపోయిందని ఝలకతి సదర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ అధికారి నసీర్ ఉద్దీన్ తెలిపారు. ఈ ప్రమాదంలో కనీసం 35 మంది ప్రయాణికులు గాయపడగా, వారిని ఝలకతి జిల్లా ఆసుపత్రికి తరలించారు. స్థానిక అగ్నిమాపక సిబ్బంది బస్సును జలదిగ్బంధం నుంచి వెలికి తీశారు. బస్సులో 60 నుంచి 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
* శవాలు దొంగతనం
ఎవరైనా బంగారమో.. వెండో… దొంగిలిస్తారు. ఇంకా బైక్ దొంగలు.. గొలుసు దొంగలు.. ఇలా చోరీ స్టోరీస్ చాలా రకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ సాధారణమే.. కాని ఇప్పుడు ఓ దేశంలో ఏకంగా ఓ వ్యక్తి చనిపోయిన వారిని దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని ఇంటిని సోదా చేసిన పోలీసులకు విచిత్రమైన సమాధానం ఇచ్చాడు. సాధారణంగా చనిపోయిన వారికి సంబంధించిన వస్తువులను ఎవరికైనా ఇవ్వడమో… బయటపడయడమో చేస్తాము. ఇక ఎముకలు, అస్థికలు.. వారి వారి సంప్రదాయాల ప్రకారం పుణ్య నదుల్లో కలుపుతారు. మెడికల్ కాలేజీల్లో అయితే చనిపోయిన వారిని ప్రాక్టికల్స్ కోసం ఉపయోగిస్తారు. ఇంకా చిన్న చిన్న స్కూళ్లల్లో ఒకటో..రెండో అస్థి పంజరాలను ఉంచి పిల్లలకు పాఠాలు చెబుతారు. కాని ఓ ప్రబుద్దుడు ఏకంగా 40 అస్థి పంజరాలను ఇంట్లోనే ఉంచుకొని.. ఎంచక్కా కుటుంబసభ్యుల మాదిరిగా వాటితోనే జీవిస్తున్న ఘటన అమెరికాలో వెలుగు చూసింది. హార్వార్డ్ మెడికల్ స్కూల్ లో కొన్ని మృతదేహాలమృతదేహాల అవశేషాలు దొంగిలించబడుతున్నాయని ఎఫ్.బి.ఐకి ఫిర్యాదు చేశారు సదరు స్కూలు సిబ్బంది . అప్పటి నుండి కేసు దర్యాప్తు చేసున్న ఎఫ్.బి.ఐ అధికారులకు కెంటక్కీకి చెందిన జేమ్స్ నాట్(39) పై అనుమానం వచ్చింది. పోలీసులు అతడి తలుపు తట్టి లోపల ఎవరున్నారని అడగగా నేను చనిపోయిన నా స్నేహితులు ఉన్నారని విచిత్రమైన సమాధానమిచ్చాడట.
* బీహార్‌లో అమానుషం
పాఠాలు చెప్పాల్సిన మాష్టారు తన వయసులో సగం కంటే తక్కువ వయసున్న విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేస్తుండగా ముగ్గురు ఆగంతకులు వారిని వివస్త్రుల్ని చేసి దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వెంటనే పోలీసులు స్పందించి ఆ మాష్టారిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ప్రాధమిక విచారణ జరుగుతోందని ఈ జంటను వేధించిన ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. బెగుసరై జిల్లా ఎస్పీ యోగేంద్ర కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పత్ కౌలా గ్రామం తెగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో సంగీతం టీచరుగా పనిచేస్తున్న కిషన్ దేవ్ చౌరాసియా(45) మైనర్ బాలిక(20) తో అసభ్యంగా ప్రవర్తిస్తుండటాన్ని స్థానిక యువకులు ముగ్గురు గమనించి వారిపై దాడి చేసి ఇద్దరి బట్టలు ఊడదీశారు. ఈ సంఘటన మొత్తాన్ని వారు వీడియో కూడా తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బయటకు పొక్కడంతో తాము రంగంలోకి దిగి ప్రాధమిక విచారణ చేపట్టామని తెలిపారు.
* హైదరాబాద్‌లో బయటపడ్డ మరో ఉగ్ర కోణం
అతిపెద్ద సైబర్ క్రైమ్ ఫ్రాడ్‌ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో రూ. 712 కోట్ల ఫ్రాడ్ చేసిన ముఠాని అదుపులోకి తీసుకున్నామని సీపీ ఆనంద్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ తరహా మోసాలకు సంబంధించి 15 వేల మంది బాధితులు ఉన్నారని అన్నారు. టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా ఈ మోసాలు జరుగుతున్నట్లు గుర్తించామన్నారు.ఆన్లైన్ లో టాస్క్‌ల పేరుతో.. మొదట డబ్బులు ఇచ్చి… ఆ తర్వాత ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మోసం చేస్తున్నారని.. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఇందులో అమాయకులే కాకుండా హై లెవెల్ పొజిషన్ లో ఉన్న ఐటీ ఎంప్లాయిస్ కూడా బాధితులు ఉన్నట్లుగా గుర్తించారని చెప్పారు. శివకుమార్ అనే ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేశామన్నారు. చైనా, దుబాయ్ కేంద్రంగా ఈ ఫ్రాడ్ జరుగుతోందని చెప్పారు.
* గుంటూరులో దారుణం
ప్రస్తుతం సమాజంలో మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది. ఇంట్లో, స్కూళ్లో, ఆఫీస్ లో ఎక్కడ ఆమెకు రక్షణ దొరకడం లేదు. ఆమెకు లైంగిక వేధింపులు సాధారణమైపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి రక్షణ కోసం ఎన్ని రకాల చట్టాలు తెచ్చినా కామాంధులకు భయం వేయడం లేదు. మహిళపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో అలాంటి దారుణ ఘటన వెలుగు చూసింది.ఓ 11 ఏళ్ల గిరిజన బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను బెదిరించి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ విషయం తెలియడంతో తండ్రి వారిని నిలిదీశారు. దీంతో అతడినీ ఆ దుండుగులు బెదిరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించారు. దీంతో అతడు భయపడి ఈ ఘటనను బయటపెట్టలేదు. కానీ మళ్లీ రెండు రోజుల తరువాత ఆ కామాంధులు మళ్లీ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో తట్టుకోలేని ఆ తండ్రి ఏమైతే అది అవుతుందని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను మీడియా ప్రతినిధులకు వెల్లడించారు.పోలీసులు, బాధితురాలు తండ్రి ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 11 ఏళ్ల గిరిజన బాలిక తన తల్లిదండ్రులుతో కలిసి నివసిస్తోంది. తన ముగ్గురు తోబుట్టువులందరికీ వివాహాలు అయ్యాయి. దీంతో వారంతా వేరు వేరుగా ఉంటున్నారు. ఆ కుటుంబంలో చివరిదైన ఆ బాలికను తల్లిదండ్రులు చూసుకుంటూ, కూలీ పనులు చేసి జీవనం సాగిస్తున్నారు. అయితే నాలుగు రోజుల కిందట ఆ బాలిక తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లారు. దీంతో ఆ చిన్నారి ఒంటరిగా ఇంట్లో ఉంది. దీనిని గమనించిన 30 ఏళ్ల లక్ష్మయ్య, 25 ఏళ్ల నవీన్ ఆ బాలికను వేరే చోటుకు తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
* యూట్యూబ్ ఛానెల్ లైక్, సబ్ స్క్రైబ్ చేసింది
ఆన్‌లైన్ వేదికగా రోజుకో తరహా మోసంతో సైబర్ నేరగాళ్లు అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. ఇంటి నుంచి పనిచేస్తూ ఆన్‌లైన్‌లో అదనంగా ఆర్జించవచ్చని మభ్యపెడుతూ క్షణాల్లో బాధితుల ఖాతా నుంచి సొమ్మును మాయం చేస్తున్నారు. నోయిడాకు చెందిన మహిళను స్కామర్లు యూట్యూబ్ చానెల్స్‌ను సబ్‌స్క్రైబ్ చేస్తూ ఆదాయం సమకూర్చుకోవచ్చని నమ్మించి ఏకంగా రూ.13 లక్షలుపైగా దోచుకున్నారునోయిడాకు మహిళయూట్యూబ్ జాబ్ స్కామ్‌లో రూ. 13 లక్షలకు పైగా నష్టపోయింది. . యూట్యూబ్ వీడియోలను చూడటానికి, లైక్ చేయడానికి సబ్‌స్క్రైబ్ చేయడానికి “వర్క్-ఫ్రమ్-హోమ్ జాబ్ ఆఫర్ తో మోస పోయింది. గ్రేటర్ నోయిడాలోని పంచశీల్ హైనిష్ సొసైటీ నివాసి కార్తీకతో నేరగాళ్లు WhatsApp మరియు టెలిగ్రామ్ లో కనెక్టివిటీ అయ్యారు. ఆమె చేసిన వర్క్ ఫ్రం హోం పనికి మొదట ఆమె ఖాతాలో 150 రూపాయిలు జమ చేశారు. ఆ తరువాత ఆమెకు మాయ మాటలు చెప్పి నాస్‌డాక్‌లో 2 వేల రూపాయిలుపెట్టుబడి పెట్టించారు. లాభంగా అదే రోజున తనకు 3 వేల 150 రూపాయిలు ఇచ్చారని తెలిపింది. ఆతరువాత కార్తీక 5 వేలు,30 వేలు,90 వేల రూపాయిలను దశల వారీగా పంపింది. ఆ తరువాత కూడా 3 లక్షలు ఒకసారి… 4 లక్షలు ఒకసారి పంపింది. ఇంకా అత్యాసతో పెట్టుబడి పెట్టేందుకు భర్త పేరు మీద పర్శనల్ లోన్ తీసుకొని . ..చివరి లావాదేవీగా రూ.2.50 లక్షలు చెల్లించింది. ఎన్ని రోజులకు డబ్బులు తిరిగి రాకపోవడంతో తన డబ్బును తిరిగి ఇవ్వాలని డిపాజిట్ చేసింది.
* మహిళ ప్రాణం తీసిన అక్రమ సంబంధం
చైన్నై రైల్వే స్టేషన్ లో దారుణం వెలుగు చూసింది.. రైల్వే స్టేషన్ లో పండ్ల వ్యాపారం చేసే మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని నలుగురు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా సమాచారం.. ఆమె హత్య జరగడానికి కారణాలు వివాహేతర సంబంధాలే అని సమాచారం.. ఈ దారుణ ఘటన జరిగి రెండు రోజులు అయ్యింది.. ఆమె చనిపోవడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది.. ఈ ఘటన తో ఒక్కసారిగా అందరు ఉలిక్కి పడ్డారు.ఈ ఘటన తీవ్ర కలకలాన్ని సృష్టించింది. రాజేశ్వరి, ఆమె భర్త భువనేశ్వర్ మీనంబాక్కం ఎంజీఆర్ నగర్లో నివసిస్తున్నారు. జీవనోపాధి కోసం రాజేశ్వరి రోజూ రైల్వే స్టేషన్లలో పండ్లు, సమోసాలు అమ్ముతుండేది. బుధవారం నాడు కూడా రోజులాగే వ్యాపారాన్ని ముగించుకొని సాయంత్రాని కి ఇంటికి బయలుదేరింది. ఇంటికి వెళ్లడం కోసం సైదాపేట రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురుచూస్తోంది… ఆ సమయంలో నలుగురు వ్యక్తులు రైలు నుంచి దిగారు.. రైలు కోసం వెయిట్ చేస్తున్న ఈమెపై విచక్షణా రహితంగా దాడి చేసి క్షణాల్లోనే అక్కడి నుంచి మరో రైలు ఎక్కి పారిపోయారు.
* చెల్లెలు తల నరికిన అన్న
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారాబంకిలో దారుణం జరిగింది. సొంత చెల్లె తలను నరికాడు ఓ యువకుడు. అనంతరం ఆ తలను తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. అసలు ఏం జరిగిందంటే.. బారాబంకిలోని ఫతేపూర్ ఏరియా మిత్వారా గ్రామానికి చెందిన ఆషిఫా (18) అనే యువతి అదే గ్రామానికి చెందిన చందూబాబు అనే యువకుడిని ప్రేమించింది. అయితే మతాలు వేరు కావడంతో యువతి కుటుంబ సభ్యలు వారి వివాహానికి నో చెప్పారు. ఈ క్రమంలోనే వారిద్దరూ లేచిపోయారు. విషయం తెలుసుకున్న యువతి సోదరుడు రియాజ్ (22) ఆ యువకుడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇక యువతిని కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. అయితే ఈ విషయమై అన్నాచెల్లెల్ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తాజాగా ఆషిఫా, రియాజ్ మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తైడైన రియాజ్ పెద్ద కత్తి తీసుకొని ఆషిఫా మెడ తల నరికాడు. అనంతరం ఆ తలను తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడని ఏఎస్పీ అషుతోష్ మిశ్రా తెలిపారు.
* మణిపూర్ లో మరో దారుణ ఘటన
మణిపూర్ హింసాత్మక హర్రర్ కు సంబంధించి ఒక్కొక్కటిగా దారుణాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా చేసి ఊరేగించడం, వారిపై లైంగికదాడి ఘటనకు సంబంధించి దృశ్యాలు వెలుగులోకి రావడంతో సంచలనం రేపింది. ఈ క్రమంలోనే అదే రోజు జరిగిన మరో షాకింగ్ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువతులపై లైంగికదాడి చేయడంతో పాటు, వారిని హత్య చేసినట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ఇద్దరు మణిపురి మహిళలను బట్టలు విప్పి ఊరేగించిన సంఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రెండు రోజుల ముందు, అదే పోలీస్ స్టేషన్లో మరో కేసులో మరో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇద్దరు కుకి-జోమి మహిళల అపహరణ, అత్యాచారం, హత్యకు సంబంధించింది కావడంతో సంచలనం రేపుతోంది. ఈ కేసులో కూడా ఎఫ్ఐఆర్ ను ఇంఫాల్ ఈస్ట్ లోని సంబంధిత పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయడానికి నెలకు పైగా సమయం పట్టిందని ఫిర్యాదు చేసిన కుటుంబం తెలిపినట్టు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. దర్యాప్తులో ఏదైనా పురోగతి ఉందో లేదో తమకు తెలియదని బాధిత కుటుంబాలు పేర్కొన్నాయి.