Politics

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరుబాట

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరుబాట

విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) ప్రైవేటీకరణకు సంబంధించి గత కొంత కాలంగా ఏపీ(AP)లో తీవ్ర వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. కార్మికులు, ఉద్యోగులు, ప్రభత్వం, పలువురు నాయకులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు దీనిపై కాంగ్రెస్(Congress) కూడా పోరుబాట పట్టనుంది.కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచాక తెలంగాణ కాంగ్రెస్ లో ఫుల్ జోష్ వచ్చింది. దీంతో ఏపీలో పూర్తిగా శిథిలావస్థలో ఉన్న కాంగ్రెస్ కు కూడా కొంచెం జోష్ వచ్చి ఇటీవల ఏపీ కాంగ్రెస్ నాయకులు కూడా ప్రెస్ మీట్స్ పెడుతున్నారు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా కర్ణాటక ఇచ్చిన జోష్ తో అన్ని రాష్ట్రాల్లో మళ్ళీ కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తుంది. దీంతో ఏపీపై కూడా కాంగ్రెస్ పెద్దలు ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. దీంట్లో భాగంగానే రాహుల్ పర్యటన ఏపీలో ఉండబోతున్నట్టు సమాచారం.ఏపి పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు నేడు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపుతామని రాహుల్ గాంధీ ప్రకటించారు. 891 రోజులుగా జరుగుతోన్న పోరాటానికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము. రేపు జింక్ గేట్ నుంచి దీక్షా శిబిరం వరకు ర్యాలీ నిర్వహించబోతున్నాము. అనంతరం మధ్యాహ్నం యూనియన్ లీడర్లతో సమావేశమవుతాము. అనంతరం ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ విశాఖ పర్యటన తేదీలను ఖరారు చేస్తాము. రాహుల్ గాంధీఆగస్టులో ఏపీకి వచ్చే అవకాశాలున్నాయి అని అన్నారు.