NRI-NRT

అమెరికాకు మొదటి మహిళ నేవీ టాప్ ఆఫీసర్‌

Auto Draft

మహిళా అధికారి అడ్మిరల్‌ లీసా ఫ్రాంచెటీని అమెరికా నౌకాదళాధిపతిగా ఎంపిక చేస్తూ అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సెనేట్‌ ఆమోదముద్ర వేస్తే.. అమెరికా మిలటరీ సర్వీసు చీఫ్‌గా ఒక మహిళ నియమితులు కావడం ఇదే మొదటిసారి అవుతుంది. జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ హోదాకు చేరిన తొలి అతివగా కూడా ఆమె గుర్తింపు పొందుతారు.