Food

వందే భారత్ రైలులో నాన్ వెజ్ చాయ్

వందే భారత్ రైలులో నాన్ వెజ్ చాయ్

రైళ్లలో హలాల్ టీ సరఫరా చేయడంపై దుమారం రేగుతోంది.  హలాల్ అంటే మాంసాహారానికి సంబంధించినది కదా…ఈ విషయాన్ని దాచిపెట్టి హలాల్ టీని  ప్రయాణికులకు ఎలా సరఫరా చేస్తారన్న  ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వందే భారత్ రైళ్లో  ప్రయాణికులకు రైల్వే ఉద్యోగి హలాల్ టీ ఇస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు “హలాల్ టీ ” ఏంటీ…దాన్ని ఎలా తయారు చేస్తారు.  రైళ్లలో మాకు కూడా ఇచ్చే చాయ్ “హలాల్” చాయేనా అన్న ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి.

ఓ వందే భారత్ రైళ్లో ప్రయాణికుడు చాయ్ ను ఆర్డర్ చేశాడు. అయితే రైల్వే సిబ్బంది అతనికి ఓ చాయ్ పాకెట్ ఇచ్చారు. దానిపై హలాల్ సర్టిఫైడ్ అని రాసి ఉంది. దీంతో ప్రయాణికుడు రైల్వే సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. హలాల్ టీ ఏంటీ..ఇది దేనితో తయారు చేశారు..అని నిలదీశారు.  ఇంతలో రైల్వే ఉద్యోగి వచ్చి దానిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ప్రయాణికుడు వినలేదు.   ఇది పవిత్రమైన శ్రావణ మాసం అని… తాము ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేసుకుంటామన్నారు. అలాంటి సమయంలో ఓ మతానికి సంబంధించి సర్టిఫికేషన్ ఉన్న టీని ఏ విధంగా ఇస్తారని ప్రశ్నించారు.

ప్రయాణికుడు వర్సెస్ రైల్వే ఉద్యోగి

హలాల్ టీ సరఫరాపై రైల్వే ఉద్యోగితో ప్రయాణికుడు ఆగ్రహంతో మాట్లాడుతూ..ఇది  పవిత్రమైన శ్రావణ మాసం. ఈ సమయంలో  హలాల్ సర్టిఫైడ్  టీ ఎలా ఇస్తారు.   హలాల్ సర్టిఫైడ్ అంటే ఏమిటో వివరించాలి.  దాని గురించి తెలియాలి.   ‘మాకు ఐఎస్ఐ సర్టిఫికేట్ గురించి తెలుసు. కానీ ఈ  హలాల్ సర్టిఫికేట్ అంటే ఏమిటో తెలియదు.

రైల్వే ఉద్యోగి బదులిస్తూ…సర్ ఇది మసాలా టీ ప్రీమిక్స్. ఇది వంద శాతం శాకాహారమే. దీంతో ఎలాంటి మాంసహారం కలపలేదు సర్.

ప్రయాణికుడు మాట్లాడుతూ.. వంద శాతం శాకాహారమే అయితే హలాల్ సర్టిఫైడ్ అంటే ఏమిటి..?  ఈ  టీ తాగిన తర్వాత మేము ఎలా పూజ చేసుకోవాలి.

రైల్వే సిబ్బంది మాట్లాడుతూ..‘‘మీరు వీడియో తీస్తున్నారా…సర్ ఇది వంద శాతం శాకాహార టీ.  టీ అంటేనే శాకాహారం సర్.

ప్రయాణికుడు మాట్లాడుతూ..నాకు మతపరమైన సర్టిఫికేషన్  అక్కర్లేదు.  మా మనోభావాలను దృష్టిలో పెట్టుకోండి… అలా అయితే స్వస్తిక్ ఉన్న  సర్టిఫికేట్ ప్యాకెట్ తీసుకురండి…

రైల్వే సిబ్బంది బదులిస్తూ…సరే సర్..మీ విజ్ణప్తిని మేమ  దృష్టిలో పెట్టుకుంటాం సర్. కానీ ఇది మాత్రం ప్యూర్ వెజిటేరియన్ టీ సర్.

అసలు హలాల్ సర్టిఫికేషన్ అంటే ఏంటీ..
హలాల్ అంటే అరబిక్లో అనుమతించదగినది అని అర్థం. హలాల్ సర్టిఫైడ్ అంటే ఇస్లామిక్ నియమాల ప్రకారం తయారు చేసిన ఆహారం అని అర్థం. హలాల్ సర్టిఫికేషన్  ప్రధానంగా ఆహారం, ఆహార సంబంధిత ఉత్పత్తుల కోసం పొందబడుతుంది. ఇది ఇస్లామిక్ దేశాలలో అవసరం. “హలాల్” అనే పదం ఖురాన్ నుండి ఉద్భవించింది,  ఒక జంతువు యొక్క  కంఠం, కంఠనాళాలను సగం నరికి చంపిన మాసం హలాల్ మాంసం అవుతుంది. హలాల్ సర్టిఫికేషన్‌ను మొదట 1974లో మాంసం కోసం ఉపయోగించారు. 1993 వరకు ఇది కేవలం మాంసం ఉత్పత్తులకు మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుతం  ఇతర ఆహారోత్పత్తులకు, కాస్మటిక్స్, మందులు, పానియాలు మొదలైనవాటికి కూడా వర్తింపజేస్తున్నారు.