Politics

ఆగస్టు 15 తర్వాతే ప్రతిపక్ష నేతల కూటమి భేటీ?

ఆగస్టు 15 తర్వాతే ప్రతిపక్ష నేతల కూటమి భేటీ?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. మలప్పురం జిల్లాలోని కొట్టక్కల్ ఆర్య వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 29 వరకు అక్కడే ఉండనున్నారు. రాహుల్ వెంట కేసి వేణుగోపాల్ ఉంటారు. జోడోయాత్ర సందర్భంగా కాళ్లకు నొప్పులు వచ్చినట్లు గతంలో తెలిపారు. నొప్పులకు వైద్యం తీసుకుంటున్నారా? మరేదైనా ఆరోగ్య సమస్య అనేది తెలియదు. ఈ విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.కాగా, ప్రతిపక్ష నేతల కూటమి ఆగస్టు 15 తర్వాతే భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో 11 మందితో కూడిన కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు కానుంది. దీనితో పాటు ప్రచార కమిటీ, కమ్యూనికేషన్ సహా నాలుగైదు కమిటీలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇటీవల బెంగళూరులో ప్రతిపక్ష నేతలు కూటమిగా ఏర్పడి సమావేశమైన విషయం తెలిసిందే.