Agriculture

తెలంగాణ రైతులకు అలర్ట్‌

Auto Draft

తెలంగాణ రైతులకు అలర్ట్‌.. తెలంగాణ లో పంట వివరాలు పక్కాగా నమోదు చేసేందుకు వ్యవసాయ శాఖ మొబైల్ యాప్ తీసుకొచ్చింది. ఇందులో రైతుల వివరాలు, పంటలు, ఎరువులు, పురుగుల మందుల వాడకం, పంట నష్టం, నేల స్వభావం వంటి వివరాలను నమోదు చేయనున్నారు. తెలంగాణ భూనక్షాను ఈ యాప్ తో అనుసంధానం చేశారు. AEOలు క్షేత్రస్థాయికి వెళ్లి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. వీరికి ట్రైనింగ్ పూర్తి కాగానే 4 వారాల్లో వివరాలు నమోదు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది.అటు అటు తెలంగాణ రాష్ట్రంలో పండుతున్న ధాన్యాన్ని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చేయడానికి తగ్గట్టుగా అధునాత రైస్‌ మిల్లులను ఏర్పాటు చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. విధివిధానాల ఖరారుకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షునిగా కమిటీని సీఎం ప్రకటించారు. ఈ కమిటీలో సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఐటీ, పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి సభ్యులుగా ఉంటారు.