Devotional

ఈ వారం మీ రాశి ఫలితాలు

ఈ వారం మీ రాశి ఫలితాలు

హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 (23-07-2023 నుండి 29-07-2023) ✍🏻
🗓 ఈ వారం మీ రాశి ఫలితాలు

🐐 మేషం (23-07-2023 నుండి 29-07-2023)

పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగితే తప్పక విజయం సిద్ధిస్తుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయండి. ఆర్థికాంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి. ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయం ఇది. అవసరానికి సహాయం చేసే వారున్నారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అధికారులతో వినమ్రంగా వ్యవహరించాలి. వారాంతంలో మేలు చేకూరుతుంది. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం (23-07-2023 నుండి 29-07-2023)

మనోబలంతో పనులను పూర్తిచేస్తారు. పనులను సకాలంలో పూర్తిచేస్తారు. ముఖ్య విషయాలలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. బంధు,మిత్రుల సహకారంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు ఉన్నాయి. అప్పులు లేకుండా పెరగాలి. అనవసర భయాందోళనలకు చేస్తున్నారు . ఇష్టదైవాన్ని స్మరించాలి.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం (23-07-2023 నుండి 29-07-2023)

మిశ్రమకాలం. చేసిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులతో కలుపుకొని పోవడం వల్ల సమస్యలను అధిగమించగలుగుతున్నారు. సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్లడం మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. స్థానచలన సూచనలు ఉన్నాయి. అనవసరంగా ఆందోళనపడటం తగ్గించుకుంటే మంచిది. సూర్య ఆరాధన శుభప్రదం.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం (23-07-2023 నుండి 29-07-2023)

లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు. పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఒక కీలక విషయంలో మీ ఆలోచనాధోరణికి ప్రశంసలు లభిస్తున్నాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్నిపెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థికాంశాలు అనుకూలంగా ఉంటాయి. మనఃస్సౌఖ్యం ఉంటుంది. ఈశ్వర ఆరాధన శుభాన్ని కలిగిస్తుంది.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం (23-07-2023 నుండి 29-07-2023)

చేపట్టే పనుల్లో పురోగతి ఉంటుంది. శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. శుభకార్యక్రమాలలో ఆనందంగా గడుపుతారు. మీ మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష. ఓర్పు చాలా అవసరం. కొన్ని వార్తలు బాధను కలిగిస్తాయి. ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలుగజేస్తుంది. సమయానుకూలంగా వ్యవహరించండి. నూతన వస్తువులను కొంటారు. అనారోగ్య సమస్యలు. సమయానికి విశ్రాంతి అవసరం. హనుమత్ ఆరాధన మంచిది.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య (23-07-2023 నుండి 29-07-2023)

దైవబలం రక్షిస్తుంది. చేపట్టే పనుల్లో ఎన్నిఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. ముఖ్యమైన విషయాల్లో బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు దరిచేరవు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలవు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. విరోధులకు దూరంగా ఉండాలి. ఇష్టదేవత ఆరాధన శుభప్రదం.
💃💃💃💃💃💃💃

⚖ తుల(23-07-2023 నుండి 29-07-2023)

మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. గతానుభవంతో పనిచేస్తే మేలు జరుగుతుంది. పక్కాప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు లేకుండా పెరగాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయకపోతే చెడు అవుతుంది, అనవసర విషయాల్లో తలదూర్చకండి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. మిత్రులకు మేలు చేసే సూచనలు. ఆత్మబలంతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. విష్ణు ఆరాధన శుభప్రదం.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం (23-07-2023 నుండి 29-07-2023)

కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచనావిధానంతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలను అందుకుంటారు. ముఖ్య విషయాలలో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధు,మిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. మీ ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం. అవగాహనతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది. ముఖ్య విషయాల్లో ఆవేశం పనికిరాదు. వారాంతంలో శాంతి చేకూరుతుంది. నవగ్రహ స్తోత్రం చదివితే మంచిది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు (23-07-2023 నుండి 29-07-2023)

కార్యసిద్ధి ఉంది. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి,ఉద్యోగ రంగాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆశయసాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు. ఉత్సాహంతో ముందుకు సాగండి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబసభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాల్లో ముందుచూపుతో వ్యవహరించడం ఉత్తమం. ఒక శుభవార్త శక్తిని ఇస్తుంది. లక్ష్మీధ్యానం శుభప్రదం.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం (23-07-2023 నుండి 29-07-2023)

శ్రేష్ఠమైన కాలం. విజయసిద్ధి ఉంది. ప్రారంరభించిన పనిలో ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుపుతారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైన ఫలితాలు ఉన్నాయి. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన మనఃస్సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవబలం సంపూర్ణంగా ఉంది. విష్ణుదేవతా ఆరాధన శుభప్రదం.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం (23-07-2023 నుండి 29-07-2023)

అభీష్టాలు ఫలిస్తాయి. మీకు అప్పగించిన పనులను సమర్ధంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకొనిపోతే మేలు జరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అధికారుల సహకారం అందుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి, కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కీలక విషయాల్లో అప్రమత్తత అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. సుబ్రహ్మణ్యస్తుతి శుభప్రదం.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం (23-07-2023 నుండి 29-07-2023)

మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. చేపట్టే పనుల్లో ఊహించిన ఫలితాలు వస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మంచి మనస్సుతో ముందుకు సాగండి, సమస్యలు తగ్గుతాయి. అవసరానికి తోటివారి సహాయం అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ధనలాభం సూచితం. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి. మంచి మనస్సుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఇస్తాయి. ఈశ్వరారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది
🦈🦈🦈🦈🦈🦈🦈